రెండు లోక్‌సభ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరి పేరును అధికారంగా ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇక విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ పేరు కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇంకా పెండింగ్‌లో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు కానున్నట్లు చేయనుంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థు లను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. తర్వలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని జనసేన తెలిపింది.


