స్వతంత్ర వెబ్ డెస్క్: జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ టీం ఎక్సపర్ట్ అంటూ చంద్రబాబు భద్రతపై అచ్చెన్న సంచలన కామెంట్లు చేశారు. జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్….జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేస్తారు.. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు చేశారు అచ్చెన్నాయుడు. జైల్లో జరుగుతున్న పరిణామాలు.. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో మాలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా.. విచారణ లేదని ఆగ్రహించారు. చంద్రబాబును అంతం చేసేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయనే లేఖలు వచ్చినా విచారణ జరపడం లేదు…జైల్ లోపల నుంచి ఫొటోలు వస్తున్నా ఎలాంటి చర్యల్లేవని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జుడిషియల్ కస్టడీలో ఉంటే ప్రభుత్వానికేం సంబంధం అని ప్రశ్నించారు. సజ్జల డైరెక్షన్లో మొత్తం వ్యవహరం నడుస్తుండడం కూడా మాకు మరింత ఆందోళన కలుగుతోంది….గోరంట్ల మాధవ్ వంటి వారి మాటలతో ప్రభుత్వ ఉద్దేశ్యాలు బయట పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు చాలా వరకు బరువు తగ్గారు…స్కిల్ సెంటర్లు లేవని గతంలో మంత్రులు కామెంట్లు చేశారని ఆగ్రహించారు అచ్చెన్నాయుడు.