Jagananne Maa Bhavishyathu |రేపటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు క్యాంపైన్ ప్రారంభం అవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రచారానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ… రేపటి నుంచి మొదలుకొని ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా క్యాంపైన్ జరుగుతుందని అన్నారు. ఏపీలో ప్రతి ఇంటికి మా ప్రతినిధులు వెళ్తారని… రాష్ట్ర వ్యాప్తంగా కోటి 80 లక్షల ఇళ్లను సందర్శిస్తారని వివరించారు. జగనన్నే మా భవిష్యత్తు క్యాంపైన్ లో భాగంగా 7 లక్షల మంది గృహ సారధులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారని అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి సాహసం గతంలో ఎవరు చేయలేదన్నారు.
Read Also: దేశానికే రోల్ మోడల్‌గా ఫ్యామిలీ డాక్టర్: సీఎం జగన్
Follow us on: Youtube, Instagram, Google News