23.7 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

ఏపీ బడ్జెట్‌లో లెక్కలు తేల్చిన జగన్‌

గవర్నర్‌ ప్రసంగంలో గవర్నర్‌ చేత అన్ని అబద్ధాలు చెప్పించారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది. రెండు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేశారు? దీనికి సంబంధించిన లెక్కలు, ఏ పథానికి ఎంత మంది అర్హులు ఉన్నారు?.. లబ్ధిదారులకు పథకాలు చేరాలంటే బడ్జెట్‌లో ఎంత కేటాయించాలి?.. ఎంత కేటాయించారు?.. ఎంత ఎగనామం పెట్టారు?.. ఇలాంటి వివరాలతో పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ ఇచ్చారు వైఎస్‌ జగన్‌.

చంద్రబాబు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారని .. రెండు బడ్జెట్‌లోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నట్లుగా బడ్జెట్ ప్రసంగం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆత్మస్తుతి- పరనింద అన్నట్లుగా బడ్జెట్‌ ప్రసంగం ఉందని జగన్‌ ఆరోపించారు. హామీల గురించి అడిగితే వాళ్ల దగ్గర ఎటువంటి సమాధానం లేదని అన్నారని చెప్పారు. గత ఏడాది బడ్జెట్, ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదని అన్నారు.

సున్నా కేటాయింపులు

ఇంకా మాట్లాడుతూ..”ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. గవర్నర్ చేత ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారు. ప్రతి పిల్లాడికి ఇప్పటికే 72 వేల రూపాయలు ఇచ్చామని చెప్పి మోసం చేశాడు. మొదటి బడ్జెట్‌లో హామీలకు కేటాయించింది బోడి సున్నా. రెండో బడ్జెట్‌లోనూ అరకొర కేటాయింపులే.

నిరుద్యోగ భృతి లేదు….ఉద్యోగం లేదు… ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఐదేళ్ల వైసిపి కాలంలో 6,31,310 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. వైసిపి ఐదేళ్ల కాలంలో 40 లక్షలపై చిలుకు ఉద్యోగాలు ఇచ్చాము. ఉద్యోగాల కల్పనలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వుందో చెప్పడానికి నిదర్శనం. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.18వేలు ఇస్తామన్నారు. ప్రతి మహిళకు చంద్రబాబు 36 వేల రూపాయలు బాకీ ఉన్నారు. మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం అని చెప్పారు.

ఉచిత బస్సు ఎక్కడ?

ఈ ఏడాది బడ్జెట్ లో కూడా ఉచిత బస్సు ప్రయాణానికి నిధులు కేటాయించలేదు. ఉచిత బస్సు ప్రయాణం కింద గత ఏడాది రూ.3500 కోట్లు, ఈ ఏడాది మరో రూ.3500 కోట్లు ఎగొట్టారు. ఉచిత ఆర్టీసీ పథకం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. విశాఖ, అమరావతి చూసి రావాలని రాయలసీమ మహిళలు ఎదురుచూస్తున్నారు. స్కూల్‌కి వెళ్ళే పిల్లలకు తల్లికి వందనం కింద 15వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. మొదటి బడ్జెట్ లో ఐదు వేల కోట్లు పెట్టారు.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్ లో డాక్యుమెంట్‌లో రూ.9,407 కోట్లు పెట్టారు.

తల్లికి వందనం ఎగ్గొట్టారు

తల్లికి వందనం పథకానికి రూ. 13,112 కోట్లు కావాలి. బడ్జెట్‌లో రూ. 13,112 కోట్లు కనపడదు. ప్రతి పిల్లాడికి చంద్రబాబు రూ.30 వేలు బాకీ పడ్డారు.

రైతులను మోసం చేశారు

పీఎం కిసాన్‌ కాకుండానే అన్నదాత- సుఖీభవ రూ.20వేలు ఇస్తామన్నారు. 53 లక్షల 58 వేల మంది రైతులకు మేము రైతు భరోసా ఇచ్చాము. 53 లక్షల మందికి రూ.10,717 కోట్లు కావాల్సి ఉంటే.. 6వేల 300 కోట్లే కేటాయించారు. ప్రతి రైతుకూ చంద్రబాబు రూ.40వేలు ఎగనామం పెట్టారు. రైతులను మోసం చేయడం చంద్రబాబుకి కొత్త కాదు.

దీపం పథకం లెక్కలు

దీపం పథకానికి రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో కోటి యాభై తొమ్మిది లక్షల సిలెండర్ కనెక్షన్స్ వున్నాయి. మొదటి ఏడాది ఒక సిలెండర్ ఇచ్చారు. రెండో ఏడాది రూ.4 వేల కోట్లు కావాలి….బడ్జెట్ లో రూ.2,439 కోట్లు కేటాయించారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.96వేలు అని మోసం చేశారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలకు రూ.79,867 కోట్లు కావాలి. గత ఏడాది బడ్జెట్‌లో రూ7 వేల 2 వందల కోట్లు కేటాయించారు.ఈ ఏడాది బడ్జెట్ లో రూ.17,179 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లకు ఏ పథకాలు ఇవ్వొద్దు అని సీఎం చంద్రబాబు చెప్పారు. పథకాలు ఇవ్వడానికి , ఇవ్వక పోవడాని ఇదేమైనా బాబు గారి సొమ్మా.? పథకాలు ఇవ్వక పోవడానికి అసలు చంద్రబాబు ఎవరు? పక్షపతానికి, రాగ ద్వేషాలకు వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పారు. సిఎం చంద్రబాబు మాటలు గవర్నర్, జడ్జిలు వింటే ఆయన్ని ఒక్క నిమిషం అయినా సీఎంగా కొనసాగించడం సబబేనా? ఇలాంటి వారిని సీఎంగా చేయడం ఏ రాష్ట్రానికి అయినా క్షేమమేనా?.. అంటూ జగన్‌ ప్రశ్నించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్