30.2 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

VRAలకు జగన్ సర్కార్ శుభవార్త.. త్వరలోనే ఉత్తర్వులు!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా వీఆర్ఏలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలోనే వీఆర్ఏల DAపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది. వీఆర్ఏల డీఏ విషయంలో క్లారిటీ ఇచ్చింది జగన్ సర్కార్. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఏపీ సర్కార్ వీఆర్ఏలకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న నెలకు రూ. 300 చొప్పున డీఏను కొనసాగించే ప్రతిపాదనలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. కొంత మంది వీఆర్ఏలు ట్రెజరీ డిపార్టుమెంట్ డైరెక్టర్ మెమో జారీచేసినప్పటికీ.. అదనంగా డీఏ డ్రా చేశారు. దీంతో వారి నుంచి ఆ అదనపు డీఏను రికవరీ చేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యం దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది. అదనంగా డీఏ డ్రా చేసిన వీఆర్ఏల నుంచి రికవరీ చేయలేదని జగన్ సర్కార్ స్పష్టం చేసింది.

 

కాగా.. గత ప్రభుత్వ హయాంలో నెలకు DA కింద చెల్లించిన రూ. 300 లను కేవలం ఐదు నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ.. 2019 జనవరిలో జీవో ఇచ్చినట్లుగా ప్రభుత్వం గుర్తుచేసింది. కాగా.. ఉద్యోగ సంఘాలు డీఏ పునరుద్దరించాలని కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదనలు తయ్యారు చేసింది. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. రాష్ట్రంలో దాదాపు 19, 359 మంది VRAలు సేవలు అందిస్తున్నారని, వారికి మెమోలు జారీ చేసినప్పటికీ.. వారి నుంచి అదనంగా డ్రా చేసిన డీఏను రికవరీ చేయలేదని డిపార్ట్ మెంట్ తెలిపింది.

 

ఇక ఇటీవలే గ్రామ రెవెన్యూ అధికారులు సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అర్హత కలిగిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని వారు సీఎం జగన్ కు విన్నవించారు. ఈ అంశంపై జగన్ సానుకూలంగా స్పందించారని రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు తెలిపారు.

 

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్