ఈనెల 21 న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు జరగనున్నాయని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు తలసాని శ్రీనివాస్.