స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో ఐటీ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. డీఎంకే సీనియర్ నేత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కరూర్ జిల్లాల్లోని 40 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు కరూర్‌లో తనిఖీలకు వ్యతిరేకంగా డీఎంకే కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారు భయంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.