స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కేరళ బోటు ప్రమాదం విచారకరంమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘోర దుర్ఘటనలో 22మంది దుర్మరణం పాలవడం విచారం కలిగించిందన్నారు. విహార యాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పో వటం.. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం దిగ్భ్రాంతికరమని పవన్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండటం అత్యంత విషాదకరమన్నారు.