సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని లింగమంతుల స్వామి జాతరకు వచ్చారు. చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. కవితతో పాటు స్వామివారిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ దర్శించుకున్నారు.
స్వామివారికి బోనం చెల్లించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు కవిత. సమక్క సారక్క జాతర తరువాత రెండో అతి పెద్ద జాతర లింగమంతుల జాతర అని.. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు లింగమంతుల జాతర నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ హయాంలో జాతరకు 14 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు కవిత.