టాలివుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌పై ఐటీ కన్నుపడింది. మంగళవారం ఉదయం నుంచే దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. వీరితో పాటు మ్యాంగో మీడియా సంస్థపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒకేసారి 8 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. 65 బృందాలుగా విడిపోయి పలు చోట్ల సోదాలు చేపట్టారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, మైత్రీ నవీన్, సీఈవో చెర్రి, మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. దిల్‌రాజు, శిరీశ్‌తో పాటు ఆయన కుమార్తె హన్సిత రెడ్డి ఇళ్లలోనూ రెయిడ్స్ అవుతున్నాయి. దిల్‌రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లో కూడా ఐటీ తనిఖీలు జరుపుతోంది.
గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా ఉండగా… డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. మూడు సినిమాలు పెద్ద బడ్జెట్‌తో తీసినవే కావడంతో ఐటీ ఫోకస్ పెట్టింది. ఇక పుష్ప2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, వ్యాపారుల ఇళ్లలోను ఐటీ సోదాలు చేపట్టాంది. పుష్ప 2 సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. వీరితో పాటు మ్యాంగో మీడియా సంస్థపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లో సోదాలు నిర్వహిస్తున్నారు.