స్వతంత్ర వెబ్ డెస్క్: ఐపీఎల్‌కు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే ఐపీఎల్ ఫైనల్ తన చివరి మ్యాచ్ అని ట్వీట్ చేశాడు. అయితే రాయుడు ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పడం వెనక ఓ కారణం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో బహిరంగసభల్లో ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రసంగాలను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. అంతేకాకుండా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలవడంతో వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి.
గుంటూరుకు చెందిన రాయుడు రాజకీయ నాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు ఉండడంతో వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. మరి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేస్తాడో త్వరలోనే తేలనుంది. అందుకే ఆయన ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంతో ప్రతిభ ఉన్న రాయుడు 2019 వరల్ట్ కప్‌కు తన పేరును సెలెక్టర్లు ప్రకటించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి తన వంతు పాత్ర పోషించి మంచి పేరు సంపాదించుకున్నాడు.