రాజధాని అమరావతి పనులు తిరిగి ఊపందుకున్నాయి. గత ఐదేళ్లుగా ఆగిపోయిన పనులు కొత్త ప్రభుత్వం రావడంతో తిరిగి పట్టాలెక్కాయి. ప్రస్తుతం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేయి స్తుండడంతోపాటు సీఆర్డీఏ ఆఫీసును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసి రాజధానికి వచ్చే నాటికి జంగిల్ క్లియరెన్స్‌తో పాటు క్లీనింగ్, స్ట్రీట్ లైటింగ్ పనులు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా పూర్తి చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీఎస్ రాజధాని పనులు పరిశీలించారు. వెంటనే మిగతా పనులు ప్రారంభిం చాలని అధికారులను ఆదేశించారు. క్లిన్‌నెస్, జంగిల్ క్లియరెన్స్ తోపాటు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాల న్నారు. అటు సీఆర్డీఏ కమిషనర్ రాజధాని అమరావతిని సందర్శించారు. అమరావతి ఏరియా కు వాటర్ సప్లై చేసే ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈనేపథ్యంలోనే ఆయన పది ఎంఎల్‌డీ వాటర్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ పనులు 95 శాతం పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 75వేల మందికి సరిపడా తాగు నీరు అందిచవచ్చన్నారు. ఎడ్యూకేషన్ ఇనిస్టిట్యూషన్‌లకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు పంపిణీ చేయవచ్చనన్నారు. అదే విధంగా జంగిల్ క్లియరెన్స్ కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించా మన్నారు. స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్‌ను వెంటనే పరిష్కరించామన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిలో పర్యటించిన ఏపీ సీఎస్ అమరావతి నిర్మాణాల స్ధితిగతులను పరిశీలించారు. ఏఏ పనులు ఏ స్ధాయిలో ఉన్నాయే ఓ నివేదికను సీఎం ప్రమాణం చేసే నాటికి సిధ్దం చేయనున్నట్టు చెప్పారు.
ఇదిలా ఉంటే రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా నిర్వహిస్తుండం పట్ల రాజధాని రైతు లు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఏమైనా కూల్చాలంటే జేసీబీలు వెళ్లేవని ఇప్పుడు అక్కడ నిర్మాణా లు ముందుకు తీసుకెళ్ల డానికి జేసీబీలు పని చేస్తున్నాయన్నారు. ఇదే విధంగా పనులు వేగంగా చేసి మాస్టల్ ప్లాన్ ప్రకారం అమరావతి సాకారం చేయాలని రైతులు విజ్జప్తి చేశారు.