25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్‌

   పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచశాంతిని కోరుకునేవారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్నెల్లు గా హమాస్‌- ఇజ్రాయెల్‌కు పరిమితమైన ఘర్షణలు ఇప్పుడు ప్రపంచం అంతటికీ విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. అందరూ ఊహిం చిందే జరిగింది. ఇజ్రాయెల్ అన్నంతపని చేసింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు మొదలె ట్టింది.

   ఇరాన్ అణు కేంద్రాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ముందు జాగ్రత్తచర్యగా ఇరాన్, తన గగనతలాన్ని మూసివేసింది. అంతేకాదు వాణిజ్య, పౌర విమానాల సర్వీసులకు అనుమతు vలను కూడా రద్దు చేసింది. ఇస్ఫహాన్ నగరంలో సైనిక శిబిరం తోపా టు అనేక అణుకేంద్రాలున్నాయి. ఇరాన్‌ అణుకేంద్రా లను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ దాడులు చేసిం దన్నది బహిరంగ రహస్యం. అణుకేంద్రాలను విధ్వంసం చేస్తే ఇరాన్ కథ ముగిసినట్లేనన్నది ఇజ్రాయెల్ ఆలోచన. కాగా ఇజ్రాయెల్ దాడులకు ఒక నేపథ్యం ఉంది. ఏప్రిల్ ఒకటో తేదీన సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ దళా నికి చెందిన ఏడుగురు సైనికాధికారులు మరణించారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి ఇరాన్‌ తీసుకెళ్లింది. ఈ దాడిని ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికే ఇజ్రాయెల్ దాడి చేసిందని ఇరాన్ భావించింది. దీనికి కౌంటర్‌గా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది. డ్రోన్లు, క్రూజ్‌, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో విడతలవారీగా డ్రోన్లను ప్రయోగించింది. తరువాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది.

    ఇరాన్‌ దాడులు ఇజ్రాయెల్‌కు ఊహించని దెబ్బ. అప్పటివరకు హమాస్‌పై ఎడాపెడా దాడులతో అఫెన్స్‌లో ఉన్న ఇజ్రాయెల్‌ దేశం తమ భూభాగంపై ఇరాన్ దాడులు చేయడాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీనికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది ఇజ్రాయెల్‌. అయితే ఇరాన్‌పై దాడులు చేయడం అంటే మాటలు కాదు. ఆయుధ సంపత్తిలో ఇరాన్‌ ప్రపంచంలోనే టాప్ ట్వంటీలో ఉంది. దీంతో ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ మల్లగుల్లాలు పడ్డారు. అయితే ఇరాన్‌పై ప్రతిదాడి చేయాల్సిందే నని నెతన్యాహూ సలహాదారుల్లోని కొంతమంది యుద్దోన్మాదులు సూచించారు. అందుకు ఇరాన్‌ దాడులు చేసిన అవకాశాన్ని సాకుగా ఉపయోగించుకోవాలన్నారు. తమవి ప్రతీకార దాడులేనని ప్రపంచం భావిస్తుం దని లెక్కలు వేసుకున్నారు. దీంతో సలహాదారుల సూచనల మేరకు ఇరాన్‌పై దాడులకు ఓటేశారు ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ.

  1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చేవరకు ఇరాన్, ఇజ్రాయెల్ మిత్రదేశాలుగానే ఉన్నాయి. అయితే ఇస్లామిక్ విప్లవం ఇజ్రాయెల్ వ్యతిరేకతను కీలకంగా కలిగిన పాలనను అధికారంలోకి తెచ్చింది. 1948లో ప్రపంచపటంపై యూదుల కోసం ఇజ్రాయెల్ దేశం ఆవిర్బవించింది. అయితే ఇజ్రాయెల్ అస్థిత్వాన్ని ఇరాన్ గుర్తించలేదు. ఇజ్రాయెల్‌ ను ఒక క్యాన్సర్ కణితిగా అప్పట్లో ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖొమైనీ అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఇదిలా ఉంటే, తమ అస్థిత్వానికి ఇరాన్ పెను ప్రమాదంగా మారిందని ఇజ్రాయెల్ భావిస్తోంది. టెహ్రాన్ చేసే ప్రకటనలు కూడా టెల్ అవీవ్‌కు ఆ అభిప్రాయాన్ని కలిగించి ఉండొచ్చు. అంతేకాదు హమాస్ సహా పాలస్తీనా గ్రూపులకు, లెబనాన్‌లోని షియా మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాలు సమకూర్చడం కూడా ఇజ్రా యెల్ ఆగ్రహానికి కారణమైంది. తమను లక్ష్యంగా చేసుకుని అణుబాంబులను ఇరాన్ తయారు చేసిం దని ఇజ్రాయెల్ గట్టిగా విశ్వసించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అంతేకా దు. కిందటేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ సంస్థ దాడికి దిగడం వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. హమాస్ సంస్థకు ఇరాన్ ఆయుధాలు, నిధులు ఇవ్వడంతో  ఈ అభిప్రా యానికి వచ్చింది ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7నాటి దాడులలో తన ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్‌ నమ్మలేదు. ఈ పరిణా మాలు చివరకు రెండు దేశాల మధ్య ముఖాముఖి యుద్ధానికి దారితీశాయి.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్