స్వతంత్ర వెబ్ డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు(మే 28) ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆరంభ పోరులో పోటీ పడిన ఇరు జట్లు తుది పోరులో సైతం పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధిస్తే వరుసగా రెండో సారి టైటిల్‌ను అందుకోనుండగా చెన్నై గెలిస్తే ఐదో సారి కప్పును ముద్దాడనుంది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓడిపోయిన గుజరాత్.. క్వాలిఫయర్-2 మ్యాచులో ముంబై ఇండియన్స్‌ను 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి విజయం సాధించింది. మొత్తంగా బలాబలాను పరిశీలిస్తే.. రెండు జట్లు సమవుజ్జీల్లా ఉన్నా కూడా.. బ్యాటింగ్‌లో చెన్నై, బౌలింగ్‌లో గుజరాత్ కొంచెం పై చేయిలో ఉన్నారని చెప్పవచ్చు. కానీ, ఈ రెండు జట్లకు కలిసొచ్చే విషయం ఆ ఇరు జట్ల కెప్టెన్‌లే. చెన్నైకి ధోని, గుజరాత్‌కి హార్దిక రూపంలో ప్రశాంతంగా పని చేసుకుపోయే కెప్టెన్లున్నారు. మరి ఈసరి కప్ ఎవరిదో తెలియాలంటే వేచి చూడాలి.
అటు గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో శుభ్‌మాన్ గిల్ ఈ సీజన్లో మూడు సెంచరీలు చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. తొలి క్వాలిఫయర్‌లో చైన్నై చేతిలో దెబ్బతిన్న గుజరాత్.. చైన్నైని ఓడించాలని గట్టి పట్టుదలతో ఉండగా.. మరో వైపు సీఎస్‌కే ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వేలు అసాధారణమైన బ్యాటింగ్‌తో పాటు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలను సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు జట్లు ఫైనల్ టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. విజేతగా నిలిచిన జట్టుకు, రన్నరప్‌కు ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారు అన్న సంగతిని పరిశీలిస్తే.. స్పోర్ట్‌స్టార్‌లోని ఓ నివేదిక ప్రకారం విజేతగా నిలిచిన జట్టుకు రూ.20 కోట్లు అందనుండగా, రన్నరప్‌కు రూ.13 కోట్లు దక్కనున్నాయి. ఇక ఎలిమినేటర్‌లో గెలిచిన ముంబైకు రూ.7 కోట్లు, ఓడిపోయిన లక్నోకు రూ.6.5కోట్లు లభించనున్నాయి. సీజన్‌లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు ఒక్కొక్కరికి రూ.15లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఆటగాడికి రూ. 20 లక్షలు అందనున్నాయి. ఈ సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడికి రూ. 12 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. సూపర్ స్ట్రైక్ అవార్డు గెలుచుకున్న ప్లేయర్‌కి రూ.15లక్షలు, అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడికి రూ. 12 లక్షలు, సీజన్ గేమ్ ఛేంజర్ ఆటగాడికి రూ. 12 లక్షలు ప్రైజ్‌మనీని