స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ రాత్రి క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ముంబయి ఇండియన్స్ ఢీకొట్టనుంది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన గుజరాత్ జటట్టు క్వాలిఫయర్-1లో మాత్రం చెన్నై చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ఫైనల్‌లో తలపడాలని భావిస్తోంది.
మరోవైపు ముంబయి ఇండియన్స్ కూడా ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి మంచి ఊపు మీద ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో చెన్నై జట్టు బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి మ్యాచులో గుజరాత్ మీద ముంబై ఓడిపోవాలని కోరుకుంటానని తెలిపాడు. ముంబై ఫైనల్ చేరితే తనకు భయమని సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా గతంలో చెన్నై-ముంబై జట్ల మధ్య ఫైనల్స్‌లో ముంబై కప్ గెలిచింది.