స్వతంత్ర వెబ్ డెస్క్: సంగారెడ్డి(Sangareddy) కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jaggareddy) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్‌లో(BRS) చేరునున్నట్టు తెలుస్తోంది. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్‌ఎస్ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్(Congress) అధిష్టానం రేవంత్ రెడ్డిని(Revanth Reddy) టీపీసీసీ(TPCC) చీఫ్‌గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం.