జూన్ 4 తర్వాత కేంద్రంలో ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, ఆమ్ ఆద్మీపార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ పతనం ప్రారంభమైందని, హర్యానా, రాజస్థాన్, బిహార్, యూపీ, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కమలదళం సీట్లు తగ్గుతున్నాయి. బీజేపీ నాయకులే.. 220-230 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడినతర్వాత ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు.