34.3 C
Hyderabad
Monday, June 9, 2025
spot_img

హమాస్‌ను ఉగ్రసంస్థగా భారత్‌ గుర్తించాలి- ఇజ్రాయెల్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: హమాస్‌ను ఉగ్ర సంస్థగా గుర్తించాలని భారత్​ను ఇజ్రాయెల్ దేశం కోరింది. ఇందుకు సంబంధించి విస్తృత సమాచారాన్ని భారత్‌కు అందించే పనిలో నిమగ్నమయ్యామని.. భారత్ తప్పకుండా హమాస్​ను ఉగ్ర సంస్థగా గుర్తింస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే దీనిని 40 దేశాలు ఉగ్రసంస్థగా గుర్తించాయని వెల్లడించింది. భారత్‌-ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో అనే విషయాన్ని తాజా సంక్షోభం రుజువు చేసిందని ఇజ్రాయెల్ చెబుతూనే.. గాజాకు మానవతా సహాయాన్ని అందించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. హమాస్‌కు సంబంధించిన సమాచారాన్నిచాలా క్రమపద్ధతిలో భారత్​తో పాటు ప్రపంచ దేశాలకు అందిస్తున్నామని భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి నవోర్‌ గిలాన్‌ తెలిపారు. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడాతోపాటు ఐరోపా సమాఖ్య దేశాలు వంటి 40 దేశాలు హమాస్‌ను ఇప్పటికే ఉగ్రసంస్థగా ప్రకటించాయని..  మిత్రదేశాలన్నీ అలానే గుర్తించాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య పోరు కొనసాగుతున్న వేళ.. తాజా పరిణామాలపై పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నవోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్