Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కులగణన జరిగాకే స్థానిక ఎన్నికలు – ఆర్‌. కృష్ణయ్య

కులగణన ప్రక్రియ చేపట్టిన తర్వాతనే రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలన్నారు బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసారు. బీసీ రిజ ర్వేషన్లను యాభై శాతానికి పెంచాలన్నారు. కుల గణన చేపట్టకుండా, రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నిక లు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

డెంగ్యూ సెకండ్ వ్యాక్సిన్

డెంగీ వ్యాధి కట్టడికి రెండో టీకా సిద్దమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ – WHO ఈ టీకాకు ఆమోదం తెలి పింది. క్యూడెంగా గా పిలువబడే ఈ టీకాను జపాన్‌కు చెందిన ఔషధ సంస్ధ తకెడా అభివృద్ధి చేసింది. అరు నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని WHO పేర్కొంది. వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ టీకాలను అందివ్వాలని కోరింది.

సింగిల్‌ స్ర్కీన్‌ ధియేటర్ల మూత

తెలంగాణలోని సింగిల్‌ స్ర్కీన్‌ ధియేటర్లు మూతపడ్డాయి. పది రోజులపాటు ప్రదర్శనల్ని రద్దు చేసాయి. ధియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పూర్తిగా తగ్గడంతో రద్దు చేసుకోవడమే ఉత్తమమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిటర్స్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఆయా యాజమాన్యాలు ఎవరికివాళ్లు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమంది ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌.

తడిచిన ధాన్యం కొనుగోలు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిం దన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్‌. బీఆర్‌ఎస్‌ పిలుపుమేరకు మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని తెలం గాణ చౌరస్తాలో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

తాబేళ్ల అక్రమ రవాణా

తాబేళ్ల అక్రమ రవాణాకు చెక్‌ చెప్పారు అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ శాఖాధికారులు. రంపచోడ వరం మండలం పోక్స్ పేట చెక్ పోస్ట్ వద్ద వీటి రవాణాను అడ్డుకుని 30 బస్తాల్లోని వెయ్యికి పైగా తాబేళ్ల ను స్వాధీన పర్చుకున్నట్లు పోక్స్‌ పేట అటవీ రేంజ్‌ అధికారి కరుణాకర్‌ తెలిపారు. రామచంద్రపురం నుండి ఒరిస్సాకు ఉల్లిపాయ బస్తాల మాటున వీటిని తరలిస్తున్నట్లు చెప్పారు.

నంబర్‌ ప్లేట్‌లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌

నంబర్‌ ప్లేట్‌లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు హైదరాబాద్‌ నగర పోలీసులు. సెల్‌ఫోన్‌, చైన్‌ స్నాచింగ్‌ దొంగతనాలు అన్నీ నంబర్‌ ప్లేట్‌లేని వాహనాల పైనే ఎక్కువగా జరిగినట్లు గుర్తించారు. చివరి అంకెలు కనిపించ కుండా చేసినా, నంబర్‌ ప్లేట్‌ను మడిచినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో ఈ డ్రైవ్‌ కొనసాగుతోందన్నారు.

అన్‌వాంటెడ్‌ కాల్స్‌ కు త్వరలో చెక్‌

రిజిష్టర్‌ కానీ మొబైల్‌ నంబర్లు, అన్‌వాంటెడ్‌ కాల్స్‌ కు త్వరలో చెక్‌ పడనుంది. ఇందుకై కేంద్రం నడుంబిగించింది. ఈ తరహా కాల్స్‌కు స్వస్త్తి చెప్పేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది ట్రాయ్‌. సాధారణంగా ఇలాంటి కాల్స్‌ బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు, రియల్‌ ఎస్టేట్‌ సంస్ధల నుంచి అధికంగా వస్తుంటాయి. వినియోగదారుల్ని పలురకాలుగా ఇబ్బందులకు గురిచేస్తాయి.

వీసా దారులకు ఊరట

హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికా ఊరట నిచ్చింది. ఉద్యోగం కోల్పోయిన మరికొంతకాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ నూతన నిబంధనలను విడుదల చేసింది. తాజా చర్యతో హెచ్‌-1బీ వీసాదారులు నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బందిలేకుండా పొందవచ్చని U S C I S పేర్కొంది.

గ్లోబల్ వార్మింగ్

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ ఈ శతాబ్దం చివరి నాటికి కనుమరుగుకానుందన్న వార్తలు కలవర పాటు కు గురిచేస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ఈ పరిణామం తప్పదం టున్నారు వాతావరణ నిపుణులు. సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నా యంటూ గుర్తు చేసారు.

టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు సునీల్‌ ఛెత్రి రిటైర్‌మెంట్‌

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌కు టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు సునీల్‌ ఛెత్రి రిటైర్‌మెంట్‌ ప్రకటిం చాడు. 20 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఛెత్రి జూన్‌ 6న కువైట్‌తో జరిగే మ్యాచ్‌ చివర దిగా పేర్కొన్నాడు. తన ఈ నిర్ణయంపై వీడియో పోస్ట్‌ చేసిన ఛెత్రి భావోద్వేగానికి గురయ్యాడు. తన కెరీర్‌ లో ఎన్నో జ్ఞాపకాలు. ఒత్తిడి, అమితమైన ఆనందాన్ని అనుభవించానన్న ఆయన రిటైర్‌మెంట్‌ గురించి చెప్పినప్పుడు తల్లి, భార్య కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేసారు.

ప్రజలకు చల్లని కబురు

వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈనెలాఖరునాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వెల్లడించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబర్‌ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్