Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

పుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పుట్‌బాల్‌ ఆడి కాస్తంత రిలాక్స్‌ అయ్యారు. ఉదయం హైదరాబాద్‌ సెంట్ర ల్‌ యూనివర్సిటీకి చేరుకున్న ఆయన విద్యార్ధులతో కలసి సరదాగా గడిపారు. ప్రొఫెషనల్‌ క్రీడాకారుని వలే గోల్‌ చేసేందుకు పరుగులు తీసి విద్యార్ధులతో పోటీ పడ్డారు. రేవంత్‌తోపాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ విద్యార్ధులతో ఆడారు.

పోలింగ్ రోజు సెలవు మంజూరు

పోలింగ్‌ రోజు సెలవు ఇవ్వాల్సిందేనన్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్. సెలవు మంజూరు చేయని సంస్ధలపై తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జూన్‌ 1 వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 160 కేంద్ర బలగాలు, 60వేల మంది రాష్ట్ర పోలీసులు ఎన్నికల బందోబస్తు విధుల్లో ఉన్నట్లు చెప్పారు.

మోడల్ ఉమెన్ పోలింగ్ బూత్

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 56వ పోలింగ్‌ కేంద్రంలో మహిళా మోడల్‌ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేసారు. ఈ బూత్‌లో ఎన్నికల సిబ్బంది అందరూ మహిళలే ఉంటారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలకు సిబ్బంది సాదరంగా ఆహ్వనం పలుకుతారు. ప్రత్యేక గదులు, సోఫాలు, తాగునీరు, వార్తాప త్రికలు, టీవీ వంటి సౌకర్యాలు సమకూర్చారు.

మహిళా నిరసన

ఎన్నికల వేళ కొత్తపేట నియోజకవర్గ మహిళల్లో చైతన్య వెల్లివిరిసింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో అభ్యర్ధులు పంచిన చీరలను తిరస్కరించారు. పంపిణీ చేసిన చీరలను నేతల ఇళ్లలోకి విసిరి నిరసన తెలిపారు.

తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛన్‌పై హైకోర్టు తీర్పు

పదవీ విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛన్‌తోపాటు పదవీ విరమణ ప్రయోజనాలను అందించా లని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ విభజన తర్వాత రిటైరైన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల తెలుగు అకాడమీలకు ఆదేశాలిచ్చింది. అకాడమీ విభజన తరు వాత ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగు ల సర్వీసు రికార్డులను పదిహేను రోజుల్లో పంపాలని ఆదేశిం చింది.

అమ్మకు మెగాస్టార్ గ్రీటింగ్స్  

హ్యపీ మదర్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్‌, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత చిరంజీవి. జన్మ నిచ్చి, పెంచి పోషించిన అమ్మకి.. ఈ ఒక్కరోజు ఏంటీ, ప్రతీ రోజు అమ్మదే. ఈ జీవితమే అమ్మది అంటూ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. పోస్ట్ కు తన తల్లితో కలసి ఉన్నఫోటోను జత చేసారు.

ధాన్య గొనుగోలు చెయ్యాలి

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం ఖండే బల్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో కార్యదర్శి సూరిగొండ తీరుపై రైతులు మండిపడ్డారు. రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తూకంలో తేడాలపై ఆందోళనకు దిగారు. రైతులపై ఆందోళనపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. తక్షణం కార్యదర్శిని సస్సెండ్‌ చేయాలన్నారు.

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల పోటెత్తారు. రద్దీ పెరిగింది. సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవస్ధానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

నాగబాబు ట్వీట్

మెగాబ్రదర్‌ నాగబాబు. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్‌ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్‌ అయ్యింది. ఆకాశం లాంటి పవన్‌ ఆలోచనా విశాలతను అర్ధం చేసుకోవ డానికి ప్రయత్నిస్తున్నానంటూ .భావోద్వేగంగా ఈ పోస్ట్ పెట్టారు. ఇందుకు పవన్ తో సంభాషించినప్పుడు సమాధానంగా అతని నుంచి వచ్చిన కొన్నింటిని ఇందులో ప్రస్తావించారు.

కేజీ కుంకుమ పువ్వు ఎంతో తెలుసా?

ఇజ్రాయిల్‌ – గాజా యుద్ద ప్రభావం కుంకుమపువ్వు సరఫరాపై పడింది. ఇరాన్‌ నుంచి ఈ పువ్వు సరఫరా భారీగా తగ్గడంతో ధర భారీగా పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో కేజీ ధర ఏకంగా 4 లక్షల 95 వేలుగా ఉంది. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో 90 శాతం ఇరాన్‌లోనే పండుతోంది. ఏటా 430 టన్నుల మేర విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

ఇండోర్ లో నోటా ఓట్స్

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ లోక్‌సభ స్ధానంలో నోటాకు పడే ఓట్లపైన ఆసక్తి నెలకొంది. ఒక జాతీయ పార్టీకి చెంది న అభ్యర్ధి బరిలో లేకపోవడంతో ఆ పార్టీ చేసిన నోటా ప్రచారమే ఇందుకు కారణం. నోటాకు పడే ఓట్లు బరిలో ఉన్న అభ్యర్ధుల జాతకాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయోనని అభ్యర్ధులు ఆందోళనలో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పడనున్న వానలు

రానున్న ఐదు రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తా యని పేర్కొంది. అటు తెలంగాణలోని మహబూబాబద్‌, వరంగల్‌, హనుమకొండ, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్