రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు ప్రచారం
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో వైఫల్యం చెందిందన్నారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర. బీఆర్‌ఎస్ అభ్యర్ది నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కళ్యాణలక్ష్మి, సాదీముబారక్ చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తానన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తప్పడు వాగ్డానాల మాయలో పడవద్దని కోరారు.
ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు ప్రచారం
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి నంబూరు శంకరరావు విజయాన్ని కాంక్షి స్తూ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. క్రోసురు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజల్ని, వ్యాపారుల్ని కలసి ఓట్లను అభ్యర్ధించారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేసారు.
బీజేపీ అభ్యర్థి రోడ్ షో
ఖమ్మం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి తాండ్ర వినోదరావు విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెంలో బీజేపీ శ్రేణులు రోడ్ షో నిర్వహించాయి. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు మాట్లాడుతూ ఖమ్మం అభివృద్ధి చెందాలంటే కమలం పువ్వు గుర్తు పై ఓటేయాలని కోరారు. సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు.
జీఎం ఆఫీస్ లో ఎమ్మెల్యే
బీజేపీ కబంధహస్తాల్లో ఉన్న భారతమాతకు విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సైనికుల్లా పనిచే యాలన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జిఎం కార్యాల యంలో ఉద్యోగుల్నికలసి ఓట్లను అభ్యర్ధించారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానానికి బీజేపీ అభ్యర్ధిని ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. పార్టీ అధిష్టానం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసారు.
ప్రచారంలో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా వీకోట మండలం తోటకునుమా గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఎదురెదురుగా తారసప డ్డాయి. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది. ఎమ్మెల్యే వెంకటగౌడ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసారు తెలుగు తమ్ముళ్లు.
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్
పోస్టల్ ఓటుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు పోటెత్తారు. గంటల తరబడి క్యూలో ఉంటూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ కోసం 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 75శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం.
స్టూడెంట్ వీసా స్లాట్స్ విడుదల
ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్ధులకు ఈనెల 31 వరకూ విద్యార్ధి వీసా స్లాట్స్‌ను అమెరికా ప్రకటించింది. డిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలలోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వూలకు హజరయ్యేందుకు విద్యార్ధులు ఆన్‌లైన్లో ఈ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. విద్యార్ధుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతానికి వేలిముద్రల నమోదుకు శని, ఆదివారా లైన ఈనెల 19, 26 తేదీల్లోనూ స్లాట్లు కేటాయించారు.
అస్ట్రజెనెకా వ్యాక్సిన్ పంపిణీ నిలుపుదల
కొవిడ్-19 వ్యాక్సిన్‌లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు అస్ట్రజెనెకా ప్రకటించింది. మార్కెట్‌లో ఆప్‌డేటెడ్ టీకాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తమ వ్యాక్సిన్ వ్యాక్స్‌జెవ్రియాకు గిరాకీ తగ్గిన నేపధ్యంలో దీని తయారీ, పంపిణీ ని నిలిపివేసినట్లు వెల్లడించింది.
ధాన్యం కొనుగోలు
ధాన్యం కొనుగోలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ భూదాన్ పోచంపల్లి రైతులు ఆందోళన చేపట్టా రు. జూలూరు గ్రామంలోకి బస్సులు రాకుండా రోడ్డు పై కంచె వేసి ధర్నా చేసారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తోందని వాపోయారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఘట్కేసర్ నుండి కీసర వైపు వస్తున్న కోడి గుడ్ల వాహనం డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గుమ్మడ వెల్లి నుండి మల్కాజ్‌గిరిలోని డీలర్ షాప్‌కు గుడ్లను తరలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు.
డివైడర్ ను ఢీ కొట్టిన కారు
అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అఫ్జల్ గంజ్ పోలీసులు క్షతగాత్రున్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విమానాలు రద్దు
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 80 విమానాలు రద్దయ్యాయి. మూడొందల మంది ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టడమే ఇందుకు కారణం. క్యాబిన్ క్రూలో ఓ వర్గం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విమానాల రద్దుపై సామాజిక మాధ్యమాల వేదికగా ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. దీనికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్షమాపణలు చెప్పి ఏడు రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చని సూచించింది. లేదంటూ రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
ప్రైవేట్ రైలు సర్వీసులు ప్రారంభం
కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో ప్రైవేట్ రైలు సర్వీస్ రాకపోకలు జూన్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ ఈ రైలు సర్వీసును నిర్వహించ నుంది. పర్యాటకుల్ని ఆకర్షించడం ఈ ట్రైన్ ప్రధాన లక్ష్యం. భారత్ గౌరవ్‌యాత్ర ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నడపనున్నారు. వైద్య నిపుణులతో సహా మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు.