వైసీపీపై ఫైర్
అసమర్ధత ముఖ్యమంత్రి జగన్ రాజ్యమేలుతున్నారని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు విమర్శించారు. దేవరపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్‌లా తయారయ్యిందని ఎద్దేవా చేశారు. దేశంలో మోదీ సీబీఐ, ఈడీ దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈటల రోడ్‌షో
మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రలోభ పెట్టి కొందరిని పార్టీలో చేర్చుకుంటున్నారని, ప్రజలంతా బీజేపీ పక్షాన ఉన్నారన్నారు. రాష్ట్ర పాలనలో కేసీఆర్ చేసిన పనే రేవంత్ చేస్తున్నారన్నారు. దేశంలో మోదీ ఉండాలనే భావన ప్రజల్లో స్పష్టం గా కనిపిస్తోందని ఆయన తెలిపారు.
రాజీనామా చేయకండి..
వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయకండని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని సతీమణి సుధా విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లకు టీడీపీ వ్యతిరేకం కాదని… వైసీపీ సేవకులుగా ఉండొద్దన్నారు. ప్రతి నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వికలాంగులకు, వృద్ధులకు వాలంటీర్ల సహాయ సహకారాలు అవస రమన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10వేలు వేతనం అందిస్తామని ఆమె తెలిపారు.
వ్యక్తి హల్‌చల్
మెదక్ జిల్లా అవుసులపల్లిలో తనకు న్యాయం చేయాలంటూ ఓ వ్యక్తి విద్యుత్ ఫోల్ ఎక్కి హల్‌చల్ చేశాడు. కొల్చారానికి చెందిన జైల్ సింగ్ అనే వ్యక్తి తమ్ముడు ఇస్తానన్న డబ్బులు ఇవ్వడం లేదని 11కేవీ హైటెన్షన్ పోల్ ఎక్కాడు. న్యాయం చేయాలని పోలీసులకు కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలు తగలడంతో జైల్‌సింగ్ కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆసుప త్రికి తరలించారు
గంజాయి అక్రమ రవాణా
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. గంజాయి, డబ్బు లు, ఆభరణాలు అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై నిఘా పెట్టారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో గునుపూర్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరెంట్ షాక్
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. పులకుర్తిలో జూనియర్ లైన్ మెన్‌గా పనిచేస్తున్న మహేష్ కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. రైతు పొలంలో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతు న్నారు.
బస్సు బీభత్సం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నవపాన్ వద్ద వెంకటరమణ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి డివైడర్ ఎక్కుతుండగా, రోడ్డు దాటుతున్న మహేష్ అనే వ్యక్తిని ఢీకొంది. తీవ్ర గాయాలైన మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కొడుకుతో కన్నతల్లే హత్య
హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్ కామాక్షిపురంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసు కుంది. సొంత కొడుకును మరో కొడుకుతో కలిసి కన్నతల్లే హత్య చేసింది. చెడు వ్యసనాలకు అలవాటు పడి స్థానికులతో గొడవ పడుతూ.. ఇంట్లో వారిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని హత్య చేసినట్లు ఆమె తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతన్నారు.


