భువనగిరి పార్లమెంట్ నియోజకర్గం నుంచి పోటీచేస్తున్న సీపీఎం
బీజేపేతర రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను వాడుకొని రాష్ట్రాల హక్కులను బిజెపి హరిస్తోందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. పదేండ్లలో బీజేపీ నియంతృత పాలన సాగించిందన్నారు. నిరుద్యోగు లకు ఉద్యోగాలు కల్పించలే దని.. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా తాము ఇండియాకుటమికి మద్దతు ఇస్తున్నామన్నారు. భువనగిరి పార్లమెంటు సీపీఎం తరుపున జహంగీర్‌ను పోటీకి నిలిపినట్లు తెలిపారు. మిగతాస్థానాల్లో బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్ని స్తామన్నారు.
కాంగ్రెస్‌లోకి చేరికలు
మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి సమక్షంలో పలు పార్టీలకు చెందిన ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమా వేశం ఇందుకు వేదికైంది. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరడం శుభసూచకమన్నారు సునీతా.
20 తర్వాతనే ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈనెల 20 తర్వాతనే విడుదల కానున్నాయి. మొత్తం నాలుగు విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించిన బోర్డ్ మార్కుల పరిశీలన జరుపుతోంది. ఇది పూర్తయిన తర్వాత ఫలితాలు విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించనుంది ప్రభుత్వం.
నీటి ఎద్దడి నివారణకై…
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు తగ్గడంతో హైదరాబాద్ జంట నగర వాసులకు తాగునీరు ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం పుట్టంగండి ఎత్తిపోతల వద్ద అత్యవసర మోటార్ల ఏర్పాటుతో నీటిని మళ్లించనుంది. ఐదు 600 HP, ఐదు 300 HP సామర్ధ్యమున్న పది మోటార్లు ఏర్పాటు చేసి నీటిని హైదరాబాద్ జంట నగరాలకు అందించనుంది.
12 అడుగుల గిరినాగు
కింగ్ కోబ్రాగా పిలువబడే 12 అడుగుల గిరినాగు జనావాసాల్లోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మోదమాంబ అమ్మవారి ఆలయ సమీపంలోని రేకుల షెడ్‌లో ఉన్న గిరినాగును చూసిన స్ధానికులు, అటవీ శాఖ సిబ్బంది భయభ్రాం తులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం ఇవ్వడం తో ఆయన బృందం అర్ధగంటకు పైగా దీన్ని బంధించేందుకు శ్రమించింది.
వెలవెలబోతున్న పాలెంవాగు
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెంవాగు జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి పడిపో యింది, యాసంగి వరి పంట చేతికందే సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జలా శయం పూర్తిస్థాయి నీటి మట్టం 434.7 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్లం 344 అడుగులకు చేరింది. జలాశయంలోని నీటిని నిల్వచేయడంలో అధికారుల వైఫల్యమే ఈ దుస్ధితికి కారణమంటున్నారు రైతులు.
పదేళ్లుగా అక్కడనే తిష్ఠ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ దంతాలపల్లి పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. గత పదేళ్లుగా ఇక్కడనే తిష్టవేసిన సిబ్బంది తీరు రోగులపాలిట శాపంగా మారింది. దాట్ల గ్రామానికి చెందిన సునీత అనే గర్భిణీ విషయంలో సిబ్బంది వ్యవహరించిన తీరు ఇందుకు అద్దంపడుతోంది. సెలైన్ బాటిల్స్ లో నాచు, పురుగులు ఉన్న సెలైన్ బాటిల్స్‌ను వాడటం వీరి నిర్లక్ష్యానికి నిలువుటద్దం. పి.హెచ్.సి సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.
ఫ్లెక్సీలు కలకలం
కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఉచిత పధకాలు వద్దు… దేశ భద్రత కావాలి అంటూ ఈ ఫ్లెక్సీలు వెలిసాయి. హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కావాలనే తదితర డిమాండ్లు ఫ్లెక్సీలపై ముద్రించారు. వీటికి అంగీకరిస్తే మా గ్రామానికి ఓట్ల కోసం రావాలంటూ ఉన్న ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆటోమొబైల్ షాప్ దగ్ధం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన అగ్ని ప్రమాదంలో వెంకట్ ఆటోమొబైల్ అండ్ మెకానిక్ షెడ్ పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి స్ధానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటల్నిఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సుమారు పది లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని వెంకటేశ్వర్లు పేర్కొన్నాడు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. బండ్లగూడ జాగీర్ కి చెందిన నవీన్ అనే వ్యాపారి ఇంటి తాళాలు పగుటగొట్టి 25వేల రూపాయల నగదు, 16 తులాల బంగారు ఆభరణాల్ని దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యా దు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నూతన డ్రెస్ కోడ్
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాధ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నూతన డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది. ఖాకీ దుస్తుల్లో కాకుండా పంప్రదాయ వస్త్రధారణలో వీరు విధులు నిర్వ ర్తించనున్నారు. ఈ మేరకు వారణాసి పోలీసు కమీషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేసారు. ధోతీ-కుర్తాతోపాటు మెడలో రుద్రాక్ష మాల ఇక నుండి వీరి డ్రెస్ కోడ్ అన్న మాట.
పర్యాటక అంతరిక్షం
పర్యాటకుడి హోదాలో గోపీచంద్ తోటకూర అనే వ్యక్తి అంతరిక్షయానం చేయనున్నారు. అమెజాన్ వ్యవ స్ధాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్ధ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లనున్నారు. 2021లో బెజోస్ సహా ముగ్గురు పర్యాటకులు రోదసియాత్ర చేసిన తదుపరి చేపట్టబోయే ఈ ఎస్‌ఎస్-25 మిషన్‌కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేసారు. విజయవాడకుచెందిన గోపీచంద్ ప్రస్తుతం అట్లాంటా శివారులోని ప్రిజర్వ్ లైఫ్ సంస్ధకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. మొత్తం 11 నిమిషాలపాటు ఈ యాత్ర ఉంటోంది.
వలసలను అడ్డుకునేందుకే…
బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్ పౌరులు, శాశ్వత నివాసితులు తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావా లనుకుంటే కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతం మేర పెంచింది. భారత వారసత్వం ఉన్న వారికి కూడా ఇది వర్తించేలా మార్పులు చేసింది. గురువారం నుంచి ఈ విధానం అమలుల్లోకి వచ్చింది. ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్ చేయాలంటే వారి కనీస వార్షిక వేతనం 29వేల గ్రేట్ బ్రిటన్ పౌండ్‌లుగా ఉండాలి. గతంలో ఈ పరిమితి 18వేల 600లుగా ఉంది.
సీనియర్ సిటీజన్స్ పోటీలు
సికింద్రాబాద్ లోని RRC గ్రౌండ్ లో సీనియర్ సిటీజన్స్ అథ్లెటిక్స్ పోటీలను మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది సీని యర్ సిటీజన్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. క్రీడల్లోనరూ సత్తా చాటుతున్న సీనియర్ సిటీజన్స్ ను అభినందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ సీనియర్ సిటీజన్స్ నిర్వహించే కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు తలసాని.
సంతకాల సేకరణ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహ్మాత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్లో సంతకాల సేకరణ కార్యక్రమంను చేప ట్టింది డెక్కన్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్. నలభై అడుగులు నడుస్తాం అంటూ నడిచింది. విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో సుమారు 50 ఏళ్ల క్రితం స్థానిక 18 బస్తీలకు కలిపి కేటాయించిన రెండెకరాల స్మశాన వాటిక స్ధలం సరిపోవటం లేదని వాపోయారు. స్ధానిక నేతలకు చెప్పినా ఫలితం లేకపోవడంతో గ్రేవీ యార్డు కోసం ఈ కార్యక్రమంను చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ వెంటనే స్పందించి తగినంత స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికుడు మృతి
నాచారం లో కల్తీ మద్యం తాగి GHMC కార్మికుడు కుమార్ మృతి చెందాడు. నాచారం లోని ప్రకృతి లిక్కర్ మార్ట్ వద్ద కార్మికుని మృతదేహం కనిపించడంతో తోటి కార్మికులు కుటుంబసభ్యలు షాక్ కు గురయ్యారు. కార్మికుని శరీరంపై గాయాలు ఉండటంతో నిరసన చేపట్టారు. అనుమతి లేకుండా, పార్కు స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై స్ధానికులు మండిపడ్డారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు.