వరంగల్ పార్లమెంటు ఎన్నికల సమీక్షా సమావేశంలో రసాభాస
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు బయటపడింది. లింగాలఘనపురం మండ లం నెల్లుట్లలో జరిగిన వరంగల్ పార్లమెంటు ఎన్నికల మండల స్థాయి సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కావ్య సమక్షంలోనే కార్యకర్తలు ఘర్షణకు దిగారు. లింగాల గణపురం ZPTC గుడి వంశీధర్ రెడ్డి, మరికొందరు కార్యకర్తలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలను చించే శారు కాంగ్రెస్ కార్యకర్తలు. రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. దీంతో చేరికలు పూర్తికాకుండానే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.
జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యలో మహిళలు ప్రోత్సా హంగా ఉండాలని మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశానన్నారు. 2006వ సంవత్సంలో జేఎన్టీయూ కాలేజ్ ఏర్పరచుకున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూతురు కవిత తలచు కుంటే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయం కాదన్నారు. వరంగల్ తర్వాత అతి పెద్ద పట్టణం నిజామాబాద్ అన్నారు.
కామారెడ్డి జిల్లాలో అకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం
ఒకవైపు ఎండలతో పంటలు ఎండిపోతుంటే… మరోవైపు అకాల వర్షం రైతులను తీరని నష్టాన్ని మిగి ల్చాయి. కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షానికి పంటలు నేలపాలయ్యాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేనికలాన్,చిట్యాల, కరడ్ పల్లి, ఎర్రపహాడ్, బ్రహ్మాజీవాడి, గాంధారి మండలాలో వరి పంటలకు తీవ్రం నష్టం వాటిల్లింది. గుర్జాల్, కోనాయిపల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో వడగళ్ల వర్షానికి వరి, మొక్కజొన్న, కూరగాయలు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలకు పంటలు నాశనమయ్యాయని.. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు.
కర్నూలు జిల్లాలో ఉపాధిహామీ కూలీల ఆందోళన
కర్నూలు జిల్లాలో ఉపాధిహామీ కూలీలు ఆందోళనబాట పట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న కూలీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. ఆదోని మండలంలోని పలు గ్రామాలకు చెందిన 500 మంది బాధితులు పాండవగల్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే వారంలో ఆరు రోజులు ఉపాధిహామీ పని కల్పించాలని కోరారు. వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక గంటపాటు రోడ్డుపై నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గోదాం దగ్దం …. మృతదేహం లభ్యం
నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో ఏకే ట్రేడర్స్ ధాన్యం నిలువ చేసిన గోదాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ నెల 1వ తేదీన గోదాం దగ్ధమైంది. మంటలు చల్లారిన తర్వాత గోదాంలో పూర్తిగా కాలి పోయి సజీవ దహనమైన ఓ పురుషుడి మృతదేహం లభ్యమైంది. ఏకే ట్రేడర్స్ యజమాని వడ్ల ఫారుక్ భాష మంటల్లో సజీవ దహనం అయ్యాడని కుటుంబ సభ్యులు రోధించారు. ఫారూక్ భాషా కాకినాడలో పాములపాడుకు చెందిన కొందరు వ్యక్తులు ప్రత్యక్షంగా చూసి పలకరించే ప్రయత్నం చేయగా.. పారిపో యాడని వారు తెలిపారు. పాములపాడుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెలి మిళ్ళ గ్రామంలో ప్రతాప్ అనే వ్యక్తి కుటుంబం జీవిస్తుంది. ప్రతాప్ మతిస్థిమితం లేకుండా తిరిగేవాడు. ప్రతాప్‌ను గోదాం వద్దకు తీసుకువచ్చి మద్యంలో విషపూరిత గుళికలు కలిపి తాగించి గోదాంకు నిప్పం టించి ఫరూక్ అదృశ్యమయ్యాడని ప్రతాప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫారూఖ్ భాషా అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోయాడని… అప్పుల భారీ నుంచి బయటపడేందుకే సజీవదహనం నాటకానికి తెరలే పాడని ప్రతాప్ కుటుంబ సభ్యులు తెలిపారు.


