18.7 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కన్నుల పండువగా…

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రఘురామ రాజీనామా…

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. ఎక్స్‌ వేదికగా రాజీనామా లేఖను విడుదల చేసారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలిసి పనిచేయలేనంటూ లేఖలో జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసారు రఘురామ.

నగదు బదిలీ విధానమే…

గృహలక్ష్మీ పథకం కింద అందజేసే గ్యాస్‌ రాయితీని నగదు బదిలీ ద్వారా అందజేయనుంది రేవంత్‌ ప్రభుత్వం. లబ్దిదారులు సిలిండర్‌ మొత్తం ధరను ముందుగా చెల్లిస్తే అటు తర్వాత వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో సబ్సిడీ మొత్తాన్ని జమచేయనుంది. ఈ మేరకు విధివిదానాల్ని రూపొందించింది రాష్ట్ర పౌరసరఫరాల శాఖ. కొత్తగా తీసుకునే గ్యాస్‌ కనెక్షన్లకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది.

ఆఫీసు బాట పట్టాల్సిందే

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి స్వస్తి పలకనున్నాయి ఐటీ కంపెనీలు. మార్చి చివరికల్లా ఉద్యోగులందరూ వారంలో అన్ని రోజులూ ఆఫీసు బాట పట్టాల్సిందే అంటూ స్పష్టతనిచ్చాయి. మరికొన్ని కంపెనీలైతే ఉద్యో గులకు ఇది చివరి అవకాశం అంటూ గుర్తుచేసాయి. దీంతో ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను వీడి గో టు ఆఫీస్‌ ఫర్‌ వర్క్‌ అనాల్సిందే.

ప్రజా పోరుబాట..

ఆళ్లగడ్డ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జ్ భూమా కిషోర్ రెడ్డి ప్రజా పోరుబాట కార్యక్రమంను ప్రారం భించారు. ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో ఉంటున్నానన్న కిషోర్‌రెడ్డి తాను గెలిస్తే దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టిస్తానంటూ హమీ ఇచ్చారు.

వింత ఘటన…

వికారాబాద్ జిల్లా మెమిన్ పేట్ మండలం చీమలదరి హనుమాన్ మందిరంలో వింత ఘటన వెలుగు చూసింది. మందిరం పై భాగాన ఎటువంటి నీటి నిల్వలు లేకున్నా స్లాబ్‌ నుంచి నీరు కారడం వింతను గొలిపిస్తోంది. ఇలా వస్తున్న నీటిని తీర్థంగా భావిస్తున్నారు గ్రామస్తులు. ఇది దేవుడి మహిమ అంటూ పేర్కొంటున్నారు స్వామి భక్తులు.

టీఎస్‌ కోడ్‌ రిజిస్ట్రేషన్‌ .. 

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్పుపై రెండు, మూడు రోజుల్లో కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. తద్వారా TS కోడ్‌ రిజిస్ట్రేషన్‌ కాస్త TG గా మారనుంది. నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. TS కోడ్‌ను TG గా మార్చాలంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నెల 5న కేంద్రానికి లేఖ రాసిన విషయం విదితమే.

అన్ని స్ధానాల్లో పోటీ .. 

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలోని అన్ని స్ధానాల్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బైగళ్ల నాగేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు బాగ్‌ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అంబేద్కర్‌ స్థాపించిన ఆర్‌పీఐ పార్టీని నేడు అథవాలే ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని గుర్తు చేసారు.

ఇంటి డాక్యుమెంట్లు చోరీ…

రంగారెడ్డి జిల్లా హైదర్ గూడ కేశవ్ నగర్ కాలనీ లో దొంగలు పడ్డారు. తాళం వేసి ఉన్న ఇంటిలోకి చొరబడి రెండు తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఒరిజినల్ ఇంటి పత్రాలను దొంగిలిం చారు. వరుసగా ఉన్న మూడు ఇళ్లకు గడియ పెట్టి దొంగలు ఈచోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ అదృశ్యం..

హైదరాబాద్‌ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజ్‌నగర్‌ నివాసి 25 ఏళ్ల మాధురి అదృశ్యమైంది. సాయి క్రాంతి అనే వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకున్న ఈమెను పెళ్లి చేస్తామంటూ పుట్టింటికి తీసుకెళ్లిన నాటి నుండి డిప్రెషన్కు వెళ్లిన మాధురి ఈనెల 15నుండి కనిపించడంలేదు. దీంతో మాధురి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

సూపర్‌ విక్టరీ….

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా తొలి పోరు రసవత్తరంగా ముగిసింది. అఖరి బంతి వరకూ ఉత్కంఠ రేపిన ఈ పోరులో ముంబయి జట్టు ఢిల్లీ జట్టుపై విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యా న్నిసూపర్‌ సిక్స్‌తో ముగించింది. అఖరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా, సజనా సూపర్‌ సిక్స్‌ కొట్టి విజయాన్ని అందించింది.

353 పరుగులకు ఆలౌట్‌

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాల్గో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 353 పరుగులకు భారత్‌ ఆలౌట్ చేసింది. తదుపరి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఆచీతూచి ఆడుతోంది. ఇంగ్లాండ్‌ జట్టులోరూట్‌ 122 పరుగులు చేసి నాటౌట్‌ బ్యాటర్‌గా నిలిచాడు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్