మహిళల ఆగ్రహం
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మహిళలను మున్సిపల్ కమిషనర్ అసభ్య పద జాలంతో దూషించారు. తమ గ్రామంలో ఐదు రోజులుగా ఉన్న తాగునీటి సమస్యను మహిళలను మద్యం మత్తులో దూర్భాషలాడాడు. మున్సిపల్ కమిషనర్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దారుణ హత్య
నంద్యాల జిల్లా వెంకటాచలం కాలనీలో సమీర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంట్లో మేడ మీద నిద్రిస్తున్న సమీర్‌ని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపారు. రంజాన్ మాసం కావడంతో ఉదయమే సమీర్‌ను నిద్రలేపడానికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా… రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
వైసీపీకి షాక్
ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. సిద్ధవటం, ఒంటిమిట్ట, సుండుపల్లి, నందలూరు, రాజంపేట మండ లాలకు చెందిన వైసీపీలో ఉన్న మేడా వర్గీయులు టీడీపీలో చేరేందుకు సిద్ధమ య్యారు. అధినేత చంద్రబాబు సమ క్షంలో పార్టీలో చేరేందుకు దాదాపు 100 వాహనాల్లో భారీగా తరలివెళ్లారు.
రోడ్డు ప్రమాదం
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్లెట్ బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొంది. ప్రమాదంలో CMR కళాశాలలో బీటెక్ విద్యార్థి అనిదుద్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువతి మృతి
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో పండ్ల కోసం చెట్టు ఎక్కిన యువతి బూలికి ప్రమాదవశాత్తు క్రిందపడి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన బూలిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జేబుదొంగ హల్ చల్
సుల్తాన్ నగర్ మహమ్మదీయ మజీద్ ఇఫ్తార్ విందులో జేబుదొంగ హల్ చల్ చేశాడు. ఇఫ్తార్ విందులో హడావిడి ఉండగా VIPల జేబులకే కన్నం వేసాడు. 8 ఫోన్లతో పాటు 2 లక్షల నగదు కొట్టేసి జారుకుం డుండగా కొంతమంది కార్యకర్తలు చూసి పట్టుకుని దొంగను పోలీసులకు అప్పగించారు.
గోమాతను జాతీయ ప్రాణిగా….
హైదరాబాద్‌లోని ఇమ్లిబన్ బస్టాండ్ గోశాలలో అమావాస్య సందర్భంగా బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు గోపూజ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గోమాతను జాతీయ ప్రాణిగాప్రకటించాలని కోరారు. బజరంగ్ సేన ఆధర్వంలో 33 జిల్లా అధ్యక్షులను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
వాహనాల తనిఖీ
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రధాన రహదారిపై ఫ్లయింగ్ స్వ్కాడ్ తనిఖీలు చేశారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి నుంచి 12లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.


