అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం – కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాము అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. కేంద్రంలో ఉన్న నాయకత్వం వల్లే దేశం ప్రశాంతంగా ఉందన్నారు. పాకిస్థాన్‌ను దెబ్బ తీయడానికి పెద్ద నోట్ల రద్దు చేశామన్నారు. గతంలో రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్‌ని చూశామని ఎద్దేవా చేశారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం పది లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. రోడ్ల కోసం రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు కేంద్రమంత్రి. అవినీతి రహిత పాలన కోరుకునే 2014లో బీజేపీని ప్రజలు గెలిపించారన్నారు కిషన్ రెడ్డి. మోదీ సర్కార్‌ను అవినీతి సర్కార్ అని ఏ ఒక్కరూ అనర నన్నారు. గతంలో దేశంలో అనేక ఐఎస్‌ఐ దాడులు చూశామని..ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దేశానికి ఎటువంటి నాయకులు కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇక హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గుతుం దని..అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. మూసీ దాటగానే ముస్లీం అతను ఉన్నాడని, అక్కడ 80 శాతం ఓటింగ్ నమోదవుతోందని ఎంఐఎంను టార్గెట్‌గా విమర్శలు చేశారు కిషన్‌రెడ్డి.
సీపీఐ మేనిఫెస్టో విడుదల
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం సీపీఐ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పెరిగిన నిత్యావసర ఖర్చులను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ఉపాధి హామీ కూలీని పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు, క్యాలెండర్ ఇయర్‌లో వర్కింగ్ డేస్ 200 వరకూ పెంచుతామని పేర్కొంది. ఇందు లో పలు హామీలను గుప్పించింది. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించడంతో అందరికీ సమ న్యా యం దక్కేందుకు, సెక్యులరిజం, ఫెడరలిజం సిద్ధాంతాలను ప్రమోట్ చేసేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రియించిన ఏపీ పోలీసు అధికారులు
కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ పోలీసు అధికారులు ఆశ్రయించారు. టీడీపీ, జనసేన, బీజేపీలు పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేశారు. తమ అనుకూల మీడియాలో తప్పుడు కథనాలపై సీఈసీకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసుల నైతక, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని… ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్నారని వారు ఆరోపించారు.
జాబ్ కోసం బాబు
జాబ్ రావాలంటే బాబు రావాలి అన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు అమిలినేని సురేంద్రబాబు, అంబికా లక్ష్మీనారాయణ. బెంగళూరు ఐటీ ఫోరమ్ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టారు. స్ధానిక ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రజా వేదిక వరకు ర్యాలీ సాగింది. సైకో జగన్ కి మరోసారి ఓటు వేసి మోసపోవద్దన్నారు నేతలు. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కారకుడైన చంద్రబాబు సేవల్ని మరువద్దని హితవు పలికారు.
ప్రత్యామ్నాయం అవసరం
ఎన్నికల సమయంలో ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు ఏపీ ప్రభుత్వ మాజీ C S, సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షులు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం. వాలంటీర్ వ్యవస్ధను ఈసీ పక్కన పెట్టి నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని సీఈఓను కోరారు. ఎవరి బాధ్యతలేంటో రాష్ట్ర ద్వారా ఆదేశాలు ఇప్పించాలన్నారు సుబ్రహ్మణ్యం.
నత్తనడకగా మూల్యాంకన
ఈనెల 3 నుండి ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మూల్యాం కనకు ప్రభుత్వ ఉపాధ్యాయులు 70 శాతానికిపైగా హాజరుకావడంలేదు. వేసవిలో తీవ్రమైన ఎండలు, స్పాట్ కేంద్రాల్లో అరకొర సౌకర్యాల వల్ల వీరు మూల్యాంకనకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు పారితోషికం విషయంలోనూ వీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాది స్పాట్‌కు హాజరైన వారికి నేటికీ టీఏ, డీఏ లు జమ కాలేదంటున్నారు మరికొందరు ఉపాధ్యాయులు.
బియ్యం తిరస్కరణ
ఆహార భద్రత కార్డులపై నిరుపేదలకు అందుతున్న బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి. పలుగురాళ్ళు, ముక్కిపో యిన బియ్యం రావడంతో బియ్యంను తీసుకునేందుకు లబ్దిదారులు నిరాకరిస్తున్నారు. కామా రెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వర్ పల్లె గ్రామంలో నాసిరకం బియ్యం మాకొద్దు అంటూ పంపిణీని అడ్డుకున్నారు. దీంతో యజమాని డిపోకు తాళం వేసి వెళ్లిపోవాల్సి వచ్చింది.
విప్రో సీఈఓగా శ్రీనివాస్
ప్రముఖ ఐటీ సంస్ధ విప్రో సీఈఓ డెలాపోర్ట్ రాజీనామా చేసారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విప్రో ఆయన స్ధానంలో శ్రీనివాస్ పల్లియాను నియమించినట్లు పేర్కొంది. ఈనెల 7 అనగా నేటి నుంచి ఆయన నియామకం అమల్లోకి రాగా ఐదేళ్లపాటు శ్రీనివాస్ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. విప్రోకు అత్యం త ముఖ్యమైన అమెరికాస్ 1 మార్కెట్‌కు శ్రీనివాస్ ప్రస్తుతం సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
అటవీ శాఖ మొద్దునిద్ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని విలువైన అటవీ సంపద అగ్నికి ఆహుతి అవుతోంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న విలువైన నీలగిరి చెట్ల వరకు మంటలు వ్యాపిస్తున్న అటవీ శాఖాధికారుల్లో కదలికలేదు. తరచూ జరుగుతున్న ప్రమాదాలు వల్ల జీవరాసుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతోందంటున్నారు జిల్లా వాసులు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతు న్నారు.
భారత్‌కు ధన్యవాదాలు
నిత్యావసర వస్తువుల్ని మాల్దీవులకు ఎగుమతి చేసే ప్రక్రియను పునరుద్ధరించడం పట్ల భారత్ కు ధన్య వాదాలు తెలిపా రు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మూసా జమీర్. ఇది ఇరుదేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహానికి అద్దంపడు తోందన్నారు. మాల్దీవుల అభ్యర్ధన మేరకు నిత్యవసర సరుకుల్ని నిర్దిష్ట స్ధాయిలో ఎగుమతి చేసేందుకు భారత్ అంగీకరించింది అని భారత్ హైకమీషన్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ప్రతిగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందిస్తూ తమ దేశం పొరుగు వారికి తొలి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
వ్యోమగాములు రాక
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం – I S S లో విధులు ముగించుకున్న ముగ్గురు వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరుకున్నారు. రష్యాకు చెందిన సోయజ్ ఎంఎస్-24 వ్యోమనౌక ద్వారా వీరంతా కజకిస్ధాన్‌లోని గడ్డి నేలల్లో దిగారు. వీరిలో రష్యాకు చెందిన ఒలెగ్ నోవిట్ స్కీ, అమెరికా వ్యోమగామి లోరల్ ఓ హారా, బెలారస్‌కు చెందిన మరియానా వాసిలెవ్‌స్కాయా ఉన్నారు. ఈ ముగ్గురు 204 రోజులపాటు రోదసిలో గడిపారు.
పింక్ ‘సేవా’ కార్యక్రమాలు
రాజస్ధాన్ మహిళల సాధికారత కోసం రాజస్ధాన్ రాయల్స్ క్రికెట్ జట్టు ఫ్రాంచైజ్ పింక్ ప్రామిస్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నీరు, సోలార్ విద్యుత్ అందించడంతోపాటు మహిళల మానసిక ఆరోగ్యం విషయంలో అండగా నిలుస్తోంది. జైపూర్ వేదికగా RCBతో జరిగిన మ్యాచ్‌లో నమోదైన ఒక్కో సిక్సర్‌కు ఆరు ఇళ్లకు సౌర విద్యుత్‌ను అందించనుంది. గులాబీ జెర్సీల అమ్మకం ద్వారా వచ్చిన నగదుతోపాటు మ్యాచ్‌కు అమ్ముడైన ఒక్కో టికెట్ నుంచి వంద రూపాయలను ఇందుకొరకు వెచ్చించనుంది.
ఛాంపియన్‌గా తరుణ్
హైదరాబాద్ యువ షట్లర్ తరుణ్ మన్నెపల్లి తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కజకిస్థాన్ అంతర్జాతీయ ఛాలెంజ్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు.ఫైనల్ పోరులో మలేసియాకు చెందిన ఎనిమిదో సీడ్ సూంగ్ జో వెన్ పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు. మరోవైపు అనుపమ ఉపాధ్యాయ మహిళల సింగిల్స్ తుదిపోరులో సహచర భారత షట్లర్ ఇషారాణిని ఓడించి రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది.
వాయిదాల పద్దతిలో…
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై చెలరేగిన వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. 2015లో మొదలైన ఈ వివాదాన్ని TSSPDCL సీఎండీ తో HCA అధ్యక్షుడు జగన్మోహనరావు చర్చలు జరిపారు. పెండింగ్ బకాయిలను వాయిదాల పద్దతిలో చెల్లిస్తామన్న HCA ప్రతిపాదనను విద్యు త్ శాఖ అంగీకరించింది. తొలివాయిదా మొత్తం చెల్లింపుకు HCA ముందుకు రావడంతో వివాదం ముగి సింది. కాగా ఈనెల 4న స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ సంబంధిత శాఖల నుండి నివేదిక కోరారు.
అమెరికా పౌరసత్వం
భారతీయ మహిళ దైబాయికి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని యూఎస్ సిటీజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. మా ఆర్లాండో కార్యాలయానికి భారత్‌కు చెందిన దైబాయి అమెరికా పౌరసత్వం పొందడానికి వచ్చారు… యూఎస్ కొత్త సిటిజన్‌కు మా అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. దైబాయి కొన్నేళ్లుగా తన కుమార్తెతో కలిసి ఫ్లోరిడా లో నివసిస్తున్నారు.


