23.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. మరో 25 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లో చేరబోతున్నారని చెప్పారు. కేసీఆర్‌ అహంకారమే బీఆర్ఎస్‌ ఇవాళ్టి దుస్థితికి కారణమని ఉత్తమ్‌ అన్నారు. కేసీఆర్‌ వల్లే 104 సీట్లు ఉన్న బీఆర్ఎస్‌ 39 సీట్లకు వచ్చిందని చెప్పారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు కేసీఆర్-జూపల్లి

మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు చేశారు. ధనిక రాష్ట్రాన్ని కాస్తా అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. పదేళ్లలో ఎన్నో కరువులు వచ్చాయని.. కేసీఆర్ ఏనాడైనా రైతుల దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఇవాళ కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి మొసలి కన్నీళ్లు కారుస్తు న్నారని మండిపడ్డారు. ఏనాడు రైతులకు పంట నష్టం ఇవ్వలేదన్న ఆయన… కరువుకు పరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా రైతు దీక్షలో పాల్గొన్న హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. చనిపోయిన రైతులను ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండగ చేశారని .. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసా యాన్ని దండగ చేసిందని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే ప్రయ త్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను కాపాడాలి, వారిలో ధైర్యం నింపాలన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు.. 13 పథకాలు అమలు చేస్తామన్నారని.. ఇప్పటికీ రైతులకు రుణమాఫీ చేయ లేదని హరీశ్‌ రావు ఆరోపించారు.

జనగామ జిల్లా పాలకుర్తిలో ఎర్రబెల్లి సంచలన కామెంట్స్

జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌ పేరు మార్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు. మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదని అనుమానం వ్యక్తం చేశా రు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. బీఆర్ఎ స్ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోతు న్నామని స్వయంగా క్షేత్రస్థాయి లీడర్లు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

వివేకా హత్య కేసులో వేగం పెంచిన సీబీఐ

వివేకా హత్య కేసులో సీబీఐ కొంత వేగంగా పని చేస్తోందని అంగీకరిస్తున్నట్లు వైఎస్‌ వివేకా కుమార్తె సునీత అన్నారు. దస్తగిరి అంశం తన పరిధిలోది కాదని తెలిపారు. దస్తగిరి చెప్పిన అంశాలపై నిరూపిం చాల్సిన బాధ్యత సీబీఐపై ఉందన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెబు తోందని చెప్పారు. జగన్‌ అసెంబ్లీలో ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడం … తమ కుటుంబంలోని వారే హత్య చేశారనే విషయాన్ని తాను మొదట నమ్మలేద న్నారు. వారిని నమ్మడం తాను చేసిన పొరపాటని సునీత అన్నారు.

రాష్ట్రంలో వైసీపీ 175 సీట్లు వస్తే జగన్‌ను భుజాలపై మోస్తా – నరేంద్ర వర్మ

రాష్ట్రంలో వైసీపీ 175 సీట్లు వస్తే జగన్‌ను భుజాలపై మోస్తానని బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి నరేంద్ర వర్మ అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు చాణక్యుడు వంటివారు అని కొనియాడారు. బాపట్ల టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య అసంతృప్తులు లేరని తామంతా ఒక్కటే అని ధీమా వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ 140 సీట్లు సాధించి అధికారంలో వస్తామంటున్న బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి నరేంద్ర వర్మ.

మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జిపై అర్ధరాత్రి ప్రమాదం, ఇద్దరు మృతి

హైదరాబాద్‌లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నిన్న అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. కేబుల్‌ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతు న్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడి కక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు తెలుస్తోంది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్