నిడదవోలులో కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారం
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్బంగా జ్యోతికాలనీలోని శ్రీవిఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను,. పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గు బాటి పురందేశ్వరిని గెలిపించాలని కోరారు కందుల. కార్యక్రమంలో జనసేన నేతలతోపాటు కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి ఫైర్
ప్రజాభవన్‌కు కంచె తొలగించి.. రైతులకు కంచె వేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీదని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా మునగాలలో సాగర్ ఎడమ కాలువకు విడుదల చేసిన నీటిని పాలేరు జలాశయానికి తరలించడాన్ని నిరసిస్తూ కాలువ నీటిని పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించకుండా కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్..సొంత జిల్లా రైతులకు సాగర్ నీళ్లు అందించలేకపోవడం వారి అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.
ప్రచారంలో దూకుడు పెంచిన అన్ని పార్టీలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. అందులో భాగంగానే ..తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా…శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గుంతకల్లు టీడీపీ కూటమి ఆత్మీయ సమావేశం
మూడు పార్టీల కలయిక త్రిమూర్తుల కలయికగా ఉందని గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయ రాం అభివర్ణించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలగాలని… రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. గుంతకల్లులో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని గుమ్మనూరు జయరాం తెలిపారు.
రైతులకు పంటనష్టంపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన
రైతులకు పంట నష్టం ఇవ్వాలని వనపర్తి నియోజకవర్గం బీఆర్‌ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు వినతిపత్రం అందజేశారు. సాగునీరు అందక పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే కరువు ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు.ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని… లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరించారు.
పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో నారాయణమ్మ అనే వృద్ధురాలు పింఛన్ కోసం సచివాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా వడదెబ్బ తగిలింది. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నారాయణమ్మ మృతి చెందింది. వాలంటీర్లు ఒకటో తారీఖు ఉదయాన్నే ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి పెన్షన్ పంపిణీ చేసేవాళ్లని… ఇప్పు డు ఈసీ ఆదేశాలతో సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సి వస్తోందని నారాయణమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని యధావిధిగా పెంచిన పంపిణీ చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు.
మదనపల్లెలో షాజహాన్‌బాషా ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో అరాచకపాలనను అంతం చేసేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారని మదనపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాష అన్నారు. మదనపల్లె పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా లాండ్రీ షాపులో బట్టలు ఐరన్ చేశారు. చేతివృత్తులను పూర్తిస్థాయిలో ఆదుకునేది చంద్రబాబుకే సాధ్యమ న్నారు..రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలపై ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారని పేర్కొన్నారు. అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు ఎన్నికలకు సిద్ధమయ్యారని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో జనంలోకి జనసేన ప్రోగ్రాం
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు మద్దతు తెలిపి..కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరారు నర్సా పురం జనసేన ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు నాయ కర్. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన అధినేతలు కలిసి పని చేస్తున్నారే తప్ప.. వ్యక్తిగత స్వార్థం లేదని తెలిపారు.
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి, ప్రవేట్ కార్యక్ర మాలలో ఆమె పాల్గొన్నారు. జంగాల పల్లి క్రాస్ రోడ్ వద్ద భుక్య జవహర్ ఎస్వీ గ్రాండ్ హోటల్‌ను, మొబైల్ షాప్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


