వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెస్తూ ఉంటోంది. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఒకే నెంబర్ తో నాలుగు ఫోన్లలో వాట్సాప్ వాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్ డ్యామేజ్ అయినా, బ్యాటరీ అయిపోయినా మరొక ఫోన్ లో మీ వాట్సాప్ వాడుకోవచ్చు.
అంటే మీ ఫోన్లోని వాట్సాప్ స్కానర్ ద్వారా మరో ఫోన్లో ఉన్న QR కోడ్ స్కాన్ చేసి లాగిన్ అవ్వొచ్చు. ఇలా నాలుగు ఫోన్లను లింక్ చేసుకోవచ్చు. సెకండరీ ఫోన్‌లో వాట్సాప్ లాగిన్ 14 రోజులు మాత్రమే ఉంటుంది. అనంతరం ఆటోమెటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.
ఈ ఫీచర్ ద్వారా చాట్ మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేయబడతాయని కంపెనీ తెలిపింది. కొద్దిరోజుల్లో వినియోగదారులకు ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. అయితే QR కోడ్ స్కానర్‌తో పాటు OTP ద్వారా కూడా లాగిన్ అయ్యే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది.


