ఏపీలో కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలువుతోందన్నారు AP సీఈవో ముకేశ్ కుమార్ మీనా. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి నిరాకరించినట్టు చెప్పారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయా లని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో నేడు, రేపు, ఎల్లుండి కూడా మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని చెప్పారు. పార్టీ ఆఫీసులు, అభ్యర్థుల నివాసాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంచామని అన్నారు. 119 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు.ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ భారీ ఎత్తున పోలింగ్ అయ్యాయని.. ఒక రౌండ్లో ఓట్లు లెక్కిస్తామని చెప్పారు. ఒక్కో రౌండ్ కి రెండున్నర గంటలు పడుతుందని మీనా చెప్పారు.