22.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

గలీజు గొడవలేం లేనప్పుడు లీజు కిస్తే సొమ్ములొస్తాయిగా…!

వేర్ దేరీజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే. సంకల్పం ఉన్న చోట మార్గం ఉంటుంది. సామెతల మాదిరి చెప్పాలంటే.. మనసుంటే మార్గం ఉంటుంది. అయితే, పక్కనే చక్కని అవకాశం ఉన్నప్పుడు.. ఈ మనసులు, సంకల్పాలు, మార్గాలతో పని లేదు కదా..! మరి ఆ మంచి అవకాశాన్ని గాలికొదిలేసి, రణాల్లా బాధపెట్టే రుణాల గురించి వెదుకులాటలు ఏమిటి…? ఏపీ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర సర్కారు కేంద్ర సహకారంతో పాటు రుణాలపైన ఆధారపడి గడ్డు పరిస్థితుల నుంచి బయటకు పడడానికి ప్రయత్నిస్తోంది. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ విలువైన కోట్ల రూపాయల భూములను లీజుకిచ్చి ఆదాయం రాబట్టుకోవచ్చు. అయితే, కోట్ల రూపాయల భూములను గాలికి వదిలేయడంతో ఏటా లక్షల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. కర్నూలులో 20 కోట్ల రూపాయల విలువైన సర్కారు భూమిని అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో, ప్రతి ఏటా లక్షల రూపాయలు ఆదాయాన్ని కోల్పోతోంది.

పర్యాటక అభివద్ది సంస్టకు చెందిన కొన్ని విలువైన ఆస్తులను సంస్ట ఉద్యోగులు చూస్తున్నారు. మరికొన్ని ఆస్తులను నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు లీజుకిస్తే, దాని ద్వారా సంస్టకు ప్రతి ఏటా కొట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతుంది. సంస్టకు సమకురుతున్న కోట్ల రూపాయల ఆదాయంతో సంస్ట మనుగడతోపాటు, సిబ్బంది జీతభత్యాలకు ఇతర ఖర్చులకు వినియెగించుకోవడానికి వీలవుతుంది. అయితే, కర్నూలులో పర్యాటక సంస్ట అభివద్ది అధికారులు ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తుండటంతో ప్రతి ఏటా లక్షల రూపాయల ఆదాయం వృధా అవుతోంది.

కర్నూలు వెంకటరమణ కాలనీలోని నాలుగు ఎకరాల భూముల్లో రెండెకరాలు కాటేజిలు, బార్ అండ్ రెస్టారెంట్ లకు కేటాయించగా, ఒక ఎకరా విస్తీరణంలో కళ్యాణ మండప నిర్మాణానికి ఉద్దేశించారు. ఇక మిగిలిన కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఎకరం భూమిని రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గి వృధాగా వదిలేసినట్టు వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇలా వదిలేసిన భూమితో, సర్కారు ప్రతి ఏటా లక్షల రూపాయల ఆదాయాన్ని కొల్పోతుంది. ఎకరా విస్తీరణంలో ఉన్న ఈ భూమి 20 కోట్ల రూపాయలు పైబడే పలుకుతున్నా, సంబంధింత అధికారుల నిరక్ష్య వైఖరి వల్ల చెత్త వాహనాల పార్కింగ్ ప్లేస్ గా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ చెత్తను తరలించే వాహనాలను ఇక్కడ ఉంచుతున్నారు. పోనీ, మున్నిపల్ కార్పొరేషన్, చెత్త వాహనాలు ఉంచుతున్నందుకు పైకం ఏమైనా చెల్లిస్తోందా అంటే ఏమీ లేదని తెలిసింది. ఎపీ పర్యాటక అభివద్ది సంస్ట కు ఒక్క పైసా సైతం చెల్లించకుండా టూరిజం భూమిని చెత్త వాహనాల పార్కింగ్ ప్లేస్ గా కార్పొరేషన్ మార్చేయడంపై పర్యాటక ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు లీజు గా ఇస్తే సంస్టకు ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయం సమకూరుతుంది.

మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న ఈ నిర్వాకాన్ని ఎపీ పర్యాటక అభివద్ది సంస్ట ప్రశ్నించాల్సింది పోయి, వత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తోంది. స్థానికులు, పర్యాటక ప్రేమికులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ టూరిజం భూమిని ఉచితంగా వినియోగించుకోవడం వల్ల కోట్ల రూపాయలు పర్యాటక శాఖకు నష్టం వస్తోంది. ఈ నష్టానికి తోడు మరో నష్టం టూరిజం శాఖకు జరుగుతోంది. ఈ భూమిని ఆనుకుని పర్యాటక శాఖకు మరో ఎకరం భూమి ఉండగా, అందులో కళ్యాణమండపం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ చెత్త వాహనాలు అక్కడ పార్కింగ్ చేయడంతో…అక్కడి కళ్యాణ మండపంలో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు చాలామంది అనాసక్తి చూపుతున్నారు. దీంతో, అటు కళ్యాణమండం ఆదాయానికి గండి పడుతోంది, ఇటు కోట్ల రూపాయల విలువైన భూమి వృధాగా ఉంటోంది.

గత ప్రభుత్వ హయాంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆదాయానికి గండి పడుతున్నా అప్పటి ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సైతం పర్యాటక సంస్థకు చెంది, నిరుపయోగంగా ఉన్న విలువైన కోట్ల రూపాయల భూములను లీజుకు ఇవ్వడం లేదని, పర్యాటక సంస్థ కు సంబంధించిన ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవడం లేదని పర్యాటక ప్రియులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ పర్యాటక శాఖ దీనిపై దృష్టి సారించాలని, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి… పర్యాటక భూములు.. ఆ శాఖకు ప్రయోజనకరంగాను, ఆదాయ వనరుగాను ఉండేలా చర్యలు తీసుకోవాలని పర్యాటక ప్రియులు కోరుతున్నారు.

Latest Articles

వసంత పంచమి వేడుకలు – బడులుగా మారిన సరస్వతీ మాత గుడులు

విద్వాన్ సర్వత్ర పూజితే అంటారు. అయితే, విద్వాంసులకు, పండితులకు, గురువులకు అందరికీ గురువు విద్యాదేవత వాగ్దేవీ మాత. సరస్వతీ మాత ఉదయించిన శుభోదయ తిథి మాఘ శుద్ద పంచమి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్