సిటీలో చాలా మంది వాహనదారులు యూటర్న్ కాస్త దూరంలో ఉంటే అక్కడి వరకు ఏం వెళ్తాం లే అనుకుని రాంగ్ రూట్‌లో వెళ్తుంటారు. ఈ క్రమంలోనే పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. ఇలా రాంగ్ రూట్‌లో వెళ్లడం వల్ల వారికే కాదు ఎదుటివారికి కూడా డేంజరే. ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగా రాంగ్ రూట్లో వెళ్లేవారికి భారీగా ఫైన్స్ వేస్తూనే తాజాగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఫైన్స్ ఏ మేర ఉంటాయి.?
శిక్ష కాలం ఏంత..?
రాంగ్ రూట్‌లో వెళ్లేవారి వల్ల యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని గుర్తించిన పోలీసులు వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సైబరాబాద్ ఏరియాలో రాంగ్ రూట్‌లో వెళ్తూ పట్టుబడ్డ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతు న్నారు. ఇందులో భాగంగా మొదటిసారి రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులపై 336 సెక్షన్ కింద కేసులు పెడుతున్నా రు. రాంగ్ రూట్‌లో వచ్చి పట్టుబడితే వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, చార్జ్‌షీట్ దాఖలు చేస్తారు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్‌లో ఒక్క రోజే 93 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు పోలీసులు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో అత్యధికంగా 32 మంది రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ పట్టుపడ్డారు. రాంగ్ రూట్‌లో ప్రయాణిం చడం వల్ల వారికే కాదు. ఎదురుగా వస్తున్న వారికి కూడా ప్రమాదమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎంత భారీగా ఫైన్స్ వేసినా ఉల్లంఘనలు తగ్గడం లేదని చెపుతున్నారు. అందుకే రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు పాల్పడే వారిపై సెక్షన్ 336 కింద కేసులు నమోదు చేస్తున్నామంటున్నారు. ఈ కేసుల్లో మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందంటున్నారు. గత నెల రోజుల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. గత నెలలో సైబరాబాద్ పరిధిలో మొత్తం 250 వాహనాలపై కేసులు పెట్టగా, నిన్న ఒక్క రోజే 93 మందిపై కేసులు నమోదు చేశారు.
యూటర్న్‌లు ఎక్కువ దూరం ఉన్న రోడ్లపై ఎక్కువగా రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్నారు వాహనదారులు. అంత దూరం వెళ్లి యూటర్న్ తీసుకునేబదులు. కొద్ది దూరం రాంగ్ రూట్‌లో వెళ్తే అయిపోతుందని అనుకుంటున్నారు. దీంతో ఆపోజిట్‌లో వచ్చే వెహికిల్స్ స్పీడ్‌గా వస్తుండటంతో యాక్సిడెంట్స్ అవుతు న్నాయి. సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా రాంగ్ రూట్‌లో వెళ్లే 124 ప్రాంతాలను గుర్తించారు పోలీసులు. ఆయా ప్లేసుల్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. రాంగ్ రూట్‌లో వెళ్లేవారిని సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ వారిపై కేసులు పెడుతామంటున్నారు. రాంగ్ రూట్‌లో వెళ్లే వెహికిల్స్‌ను సీజ్ స్టేషన్‌కు తరలిస్తున్నామం టున్నారు. వాహనదారులు తిరిగి కోర్టు ద్వారా తమ తమ వాహనాలను తీసుకోవాలని చెబుతున్నారు.ఫైన్స్ వేసినా తీరుమారని వాహనదారులు ఇక జాగ్రత్త. రాంగ్ రూట్‌లో వెళ్లే వారిని సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ కేసులు నమోదు చేస్తున్నారట. ఇకనైనా తీరుమార్చుకొని మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను రక్షిం చండి.


