స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మాట్లాడుతూ.. టీడీపీ అధికారం లోకి వస్తే.. మహిళల కోసం ‘మహాశక్తి’ కార్యక్రమం తెస్తామని అన్నారు. 18 నుంచి 59 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఖాతాల్లో వేస్తామని వెల్లడించారు. మహిళలకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఒక సంవత్సర కాలానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని అన్నారు. ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తామని వెల్లడించారు.


