Pavan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ మంత్రులకు, వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏంటని.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. ఇటీవల తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.. ఏపీ రాష్ట్ర పరిస్థితిపై మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కొందరు ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన పవన్.. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తే సరే కానీ.. తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడటం తగదని అన్నారు. ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదు కానీ, ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం అత్యంత దురదృష్ణకరమన్నారు. ఒక జాతిని అవమానించేలా ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే… వైసీపీ సీనియర్ నేతలు వారిని హెచ్చరించరా? అసలు వారు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. విమర్శించాలనుకుంటే ఒక వ్యక్తిని విమర్శించాలే తప్ప తెలంగాణ ప్రజలను విమర్శించడమేంటని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2023