24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

బీజేపీ ఓడిపోతే మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారా?.. పురంధేశ్వరికి పోసాని కౌంటర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గాలను నందమూరి కుటుంబమే చెప్పింది. చంద్రబాబు అవినీతిని సీనియర్‌ ఎన్టీఆర్‌ అప్పుడే బయటపెట్టారని అన్నారు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి. చంద్రబాబు అవినీతిపరుడని పురంధేశ్వరి భర్తతో పాటు ఆమె తండ్రి ఎన్టీఆర్‌, ఆమె పార్టీ ప్రధానమంత్రి మోదీ చెప్పారని గుర్తు చేశారు.

పురంధేశ్వరికి స్ట్రాంగ్‌ కౌంటర్‌..
కాగా, పోసాని కృష్ణమురళి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన పదవి కోసం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీనే చెప్పారు. ఈ విషయం పురంధేశ్వరికి తెలియదా?. ఎన్టీఆర్‌ పెట్టిన మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. అప్పుడు పురంధేశ్వరి ఎందుకు ప్రశ్నించలేదు. ఎన్టీఆర్‌ వ్యతిరేకించిన కాంగ్రెస్‌లో మీరు ఎలా చేరారు?. బీజేపీ ఓడిపోతే మళ్లీ కాంగ్రెస్‌లో చేరిపోతారా?. నిత్యం రాజకీయ పార్టీలు మారే మీకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదు.

బీజేపీపై దోమంత ప్రేమ కూడా లేదు..
పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు కాగానే సీఎం జగన్‌ను, వైఎస్సార్‌సీపీని తిట్టడం మొదలు పెట్టింది. చంద్రబాబు బంధువు, దగ్గరి బంధువు కాబట్టి వచ్చి రాగానే అరెస్టుపై మాట్లాడుతుంది. కక్షగట్టి బాబును అరెస్ట్ చేశారని చెప్పారు. ఆమె కొన్ని జిల్లాలు తిరిగాను అని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో క్లియర్‌గా ఈ ముగ్గురు చెప్పారు చూశారుగా అంటూ కొన్ని వీడియోలు చూపించారు. ఈ క్రమంలో బాలకృష్ణకు సంబంధించిన ఓ కేసు విషయంలో పురంధేశ్వరి ఏం చేశారో వివరించారు. దీంతో, మీ తమ్ముడికో న్యాయం మిగతా వారికి ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. పురంధేశ్వరికి బీజేపీపై దోమంత కూడా ప్రేమ లేదంటూ ఎద్దేవా చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్