ఏపీలో కూటమి అధికారంలో రాబోతోందని సర్వేలు తేల్చాయని టిడిపి నేత బుద్దా వెంకన్న అన్నారు. సీఎంగా చంద్ర బాబు అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే ఫలితాల కోసం చూశారని చెప్పారు. ఆరా మస్తాన్ తో వైసిపి వస్తుందని జగన్ చెప్పించారని విమ ర్శించారు. కూటమి అధికారంలోకి రాకుంటే తాను నాలుక కోసుకుంటానని చాలెంజ్ చేశారు. కూటమి వస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటాడా అని సవాల్ విసిరారు. జగన్ నీ క్రిమినల్ ఆలోచనలతో ఫేక్ సర్వే చెప్పించారని విమర్శించారు. వైసిపి క్యాడర్ లో ఇప్పటికే ఓటమి నైరాశ్వం ఉందన్నారు. కూటమికి 130 సీట్లకు పైగా వస్తాయని దీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ఏజెంట్ లుగా వెళ్లే విపక్ష పార్టీ లవారిని భయ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.