స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జి.జయలక్ష్మి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ బదిలీ అయ్యారు. పర్యాటక, సంస్కృతికశాఖ అదనపు బాధ్యతలు కూడా భార్గవకు అప్పగించారు. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలను సీఎస్ జవహర్‌రెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్గా అనంతరామును బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఎండీ ఇంతియాజ్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్గా లక్ష్మీషాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా ఇటీవలే ఎనిమిది జిల్లాల కలెక్టర్లు సహా 56 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.