Jaana Reddy | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంలోకి వచ్చాక 1978 నుంచి వరుసగా 11 సార్లు పోటీ చేశానని.. అయితే వచ్చే ఎన్నికలల్లో ఈసారి తాను పోటీ చేయడం లేదన్నారు. నల్గొండలో శుక్రవారం జరిగిన నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తన ఇద్దరు కుమారులు పోటీ చేస్తారా లేక ఒక్కరే పోటీ చేస్తారా అనేది వారే నిర్ణయించుకుంటారని తెలిపారు. ఇక వీరిద్దరికి టికెట్టిచ్చే విషయం గురించి అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనేది రాష్ట్ర నేతలు, అధిష్టానం కోరిక అయితే సీఎంగా నియమించిన తర్వాత పోటీ చేస్తానని అన్నారు.