స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేయడంపై చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్ షర్మిల తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ ను సోనియాగాంధీ గౌరవిస్తున్నారు కాబట్టే వారితో చర్చలకు వెళ్లానని చెప్పారు. ఎఫ్ఐఆర్ లో వైఎస్ పేరును చేర్చడం సోనియాకు తెలియక జరిగిందని అన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడా సీబీఐ చార్జిషీట్ లో అబ్ స్కాండర్ గా ఆయన పేరును చేర్చారని… ఆ బాధ ఎలా ఉంటుంతో తమకు తెలుసని వారు తనతో అన్నారని చెప్పారు. వైఎస్ లేని లోటు తెలుస్తోందని రాహుల్ అన్నారని తెలిపారు.
కేసీఆర్ అవినీతి పాలనను సాగనంపేందుకే సోనియాతో చర్చలు జరిపానని తెలిపారు. తమ కేడర్ తో చర్చించిన తర్వాతే విలీనంపై మీడియాతో మాట్లాడతానని చెప్పారు. త్వరలోనే అన్ని వివరాలను తెలియజేస్తానన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు. తెలంగాణలో తాను 3,800 కి.మీ. నడిచానని, తనతో పాటు నడిచిన వారిని నిలబెడుతానని చెప్పారు.


