స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు జైలు నుండి విడుదల అయ్యాడు. రాజమండ్రి నుండి బయటకు వచ్చిన అనంతరం ప్రజలను మరియు మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశాడు, ముందుగా తనకు సంఘీభావం తెలిపిన అందరికీ ధన్యవాదములు చెప్పగా, ఆ తరువాత తన పరిస్థితి గురించి ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, చేయబోను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజల నుండి అశేషమైన స్పందనను చూసి నేను గెలిచాను అంటూ చంద్రబాబు ఎమోషనల్ అయ్యాడు. ఇంకా పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీతో కలిసి వెళుతుందని ప్రకటించి బహిరంగంగా నాకు మద్దతు తెలిపారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక కోర్ట్ తెలిపిన ప్రకారం బయట ఎక్కడా కూడా స్కిల్ స్కాం కు సంబంధించి కానీ మాట్లాడలేదు. మరి ముందు ముందు ఏమైనా చంద్రబాబు నోరు జారే అవకాశం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక చంద్రబాబు రాకతో టీడీపీ శ్రేణులలో కొత్త ఉత్సాహము వచ్చింది.