స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో కీలకంగా మారనున్న జేడీఎస్ మెరుగ్గా రాణిస్తోంది. ఈ క్రమంలో జేడీఎస్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ..ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపు తరుణంలో తనను ఇప్పటి వరకు ఎవరూ కాంటాక్ట్ కాలే దని అన్నారు. తనకు డిమాండ్ లేదని.. తనదో చిన్న పార్టీ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఎన్నికల గెలుపుపై రాబోయే 2-3 గంటల్లో క్లారిటీ వస్తుందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్టీలే భారీగా స్కోర్ చేయనున్నట్లు వివరించారు. ఇక అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ 110 స్థానాలతో లీడింగ్‌లో ఉంది. 83 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది.