స్వతంత్ర వెబ్ డెస్క్: నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్ (Minister KTR) . నిజాం కాలేజ్ లో 1993- 96 వరకు చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు. కాలేజీకి మంచి పేరుందున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు తాను నిజాం కాలేజీలో చదువుకున్నట్లు గొప్పగా చెబుతానని వెల్లడించారు.
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ (Nizam College)లో బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్‌కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమారెడ్డి ఇదే నిజాం కాలేజీలో చదివినా నిధులివ్వలేదని విమర్శించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ కు రూ. 40 కోట్లు అందజేశామన్నారు.
మరో ఏడాదిలో భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. నిజాం కాలేజ్ గ్రౌండ్ కు ఇబ్బందులు రాకుండా నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రానికే తలమాణికం ఓయూ అని అన్నారు కేటీఆర్. 144 కోట్లతో ఓయూలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవ్ లప్ మెంట్ జరుగుతుందన్నారు.