స్వతంత్ర వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mainampalli Hanumantha Rao) వివాదాస్పద వ్యాఖ్యలతో అను నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా తాను మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఆడియో కాల్(Audio Call) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘మోదీ, కేసీఆర్, కేటీఆర్‌లకు కూడా నేను ఎవరికీ భయపడను. నేను తలచుకుంటే ఎవరినైనా మర్డర్ చేయగలను. టీడీపీలో ఉన్నప్పుడు నేను ఒక్కడినే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్ధతిచ్చాను. నా స్టైల్ లో నేను ఉంటా.. మహేందర్ రెడ్డి, రేవంత్‌రెడ్డిలకు కూడా అప్పట్లో వార్నింగ్ ఇచ్చాను. బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగలేవని చెప్పా.’’ అంటూ తీవ్ర పదజాలంతో మైనంపల్లి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఆడియో లీక్ నెట్టింట వైరల్(Viral) గా మారింది. ఈ విషయంపై బిఆర్ఎస్ అధినేత ఏ విధంగా స్పందిస్తారు అన్న ప్రశ్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.