28.5 C
Hyderabad
Friday, June 27, 2025
spot_img

పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తా.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులగా వచ్చిన బ్రో సినిమా కలెక్షన్లతో పాటు రాజకీయ దుమారాన్ని రేపింది. ముఖ్యంగా ఆ సినిమాలో యాక్టర్ పృథ్వీ పాత్ర వివాదాస్పదమైంది. మంత్రి అంబటి రాంబాబును వ్యంగ్యంగా ఆ పాత్రలో చూపించారనే వాదనలు వచ్చాయి. డ్రెస్సింగ్, డ్యాన్స్‌‌తో అంబటి రాంబాబును అనుకరించి కామెడీ చేశారని చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. తాను కూడా ఓ సినిమా తీస్తున్నానని మంత్రి అంబటి చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ సినిమా తీస్తానని, అందుకు కథ సిద్ధంగా ఉన్నదని, సినిమా పేర్లు పరిశీలిస్తున్నానని చెప్పారు.
బ్రో సినిమా పేరును పోలిన మ్రో పేరున పరిశీలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మ్రో(MRO) అంటే మ్యారేజెస్, రిలేషన్స్, అఫెండర్స్ అని తెలిపారు. అంతేకాదు, మ్రోతోపాటు మరికొన్ని పేర్లను ఆయన చదివి వినిపించారు. పెళ్లి పెటాకులు, తాళి ఎగతాళి, బహుభార్య ప్రావీణ్యుడు వంటి పేర్లను ఆయన చదివారు. సినిమా స్టోరీని కూడా ఆయన చెప్పారు. మంచి నేపథ్యం ఉన్న కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు జన్మిస్తారని, ఇద్దరు ప్రయోజకులవుతారని, చివరి వ్యక్తి మాత్రం ఊగిపోతూ ఉపన్యాసాలు ఇస్తారని అన్నారు.
ఈ సినిమాలో ఆ వ్యక్తి పెళ్లిళ్ల గురించి చూపిస్తామని, క్లైమాక్స్‌లో మహిళలు గుణపాఠం నేర్పటాన్నీ చూపిస్తామని వివరించారు.ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు చేశారు.  బ్రో సినిమాలో శ్యామ్ బాబు అని పేరు పెట్టిన పాత్రను పృథ్వీ పోషించారు. గతంలో అంబటి రాంబాబు ఓ వేడుకలో డ్యాన్స్ చేసినప్పుడు వేసుకున్న డ్రెస్‌ను పోలిన డ్రెస్సే వేసుకుంటాడు.. అదే మేకప్‌లోకనిపిస్తాడు. ఈ పాత్ర వివాదానికి కేంద్రమైంది. అయితే, సినిమా యూనిట్ మాత్రం ఈ ఆరోపణలు కొట్టివేసింది. ఈ పాత్ర కాకతాళియం అని, శ్యామ్ బాబు పాత్రకు, రాంబాబుతో సంబంధం లేదని స్పష్టం చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్