హైడ్రా దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. హైకోర్టు ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గలేదు. కొత్త సంవత్సరంలో మరింత దూకుడు పెంచింది హైడ్రా. మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్క్ ఆక్రమణపై హైడ్రా కొరడా ఝళిపించింది. నేరేడ్‌మెంట్ డిఫెన్స్ కాలనీలోని సర్వే నెంబర్ 218/1 లో పార్క్ ఆక్రమించారని కూల్చివేతలు చేపట్టింది. డిఫెన్స్ కాలనీ హౌసింగ్ సొసైటీ సభ్యుడు శివయ్య, రాబిన్ జేమ్స్ పార్క్ కబ్జా చేశారని పోలీసులకు హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. పార్క్ ఆక్రమించి కట్టిన షెడ్లను జీహెచ్‌ఎంసీ సహాయంతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.