ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పేరు మార్చుకున్నారు. ఎక్కడా అని అనుకుంటున్నారా.. సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో ఎలన్ మస్క్ తన పేరు మార్చుకున్నారు. తన పేరును కెకియస్ మ్యాక్సిమస్‌గా మార్చుకోవడంపై అనేక ఊహాగానాలకు తావిస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టబోతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఆయన సన్నిహితుడు. ఎలన్ మస్క్ ఎక్స్ లో తన కొత్త ప్రొఫైల్ పెట్టారు. అలాగే పేరు కూడా మార్చారు. ప్రొఫైల్ ఫోటోగా పెపె ద ఫ్రాగ్ వాడారు. అమెరికాలో ఫార్ రైట్ గ్రూప్‌లు ఈ మీమ్‌ను వాడుతుంటారు.
ఇక ఎలన్ మస్క్ తన పేరు మార్చుకోవడంతో క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో కదలికను తెచ్చింది. మస్క్ తన ప్రొఫైల్‌లో చేసిన మార్పుల వల్ల ఆయన ప్రొఫైల్ ఫోటోగా ఉంచిన క్యారక్టర్ పేరుతో ఉన్న ఓ మీమ్ కాయిన్ ధర అమాంతం పెరిగిపోయింది.
ఇలా జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ మస్క్ చేసిన వ్యాఖ్యలతో క్రిప్టో కరెన్సీల ధరలపై ప్రభావం కనిపించాయి. అయితే ఇప్పుడు క్రిప్టో కాయిన్ విషయంలోనూ ఎలన్ మస్క్ జోక్యం ఏమైనా ఉందా అనే దానిపై చర్చ జరుగుతోంది.