ఐపీఎల్ 17వ సీజన్‌లో నమ్మశక్యం కాని ఆట తీరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంతో అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాయింట్ల పట్టికలో రెండో స్థానంపై హైదరాబాద్ కన్నేసింది. నామమాత్రపు మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌త్ తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి రెండో స్థానానికి చేరాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. మరోవైపు పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండోస్థానంలో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచి విజయంతో ఈ సీజన్‌ను ముగించాలని భావిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లే ప్రధాన బలంగా ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు దాడితో ప్రత్యర్థులను చితకబాదుతున్నారు. నిలకడ లేమితో హెన్రిచ్ క్లాసెన్ హైదరాబాద్‌ను వేధిస్తుండగా…నితీష్ కుమార్ రెడ్డి పర్వాలేదనిపిస్తున్నాడు. ఇక బౌలర్లు కూడా తమ ఆట తీరును మెరుగుపరుచుకున్నారు. మరోవైపు ఓటములతో సతమతమవుతున్న పంజాబ్‌కు కెప్టెన్ శామ్ కుర్రాన్‌తో సహా ఇంగ్లండ్ ఆటగాళ్లు అందరూ దూరమయ్యారు. జాతీయ జట్టుకు ఆడేందుకు శామ్ కరణ్ స్వదేశానికి వెళ్లాడు. జితేష్ శర్మ ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఆఖరి మ్యాచ్‌కు నాయకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పంజాబ్, హైదరాబాద్ దాటికి తట్టుకుంటుందా అన్నది చూడాలి.


