ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ మహానగరం మరో ఘనత దక్కించుకుంది. హెన్రీ అండ్ పార్ట్‌నర్స్ వెల్లడించిన ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల-2023(World’s Wealthiest Cities Report-2023)జాబితాలో 65వ స్థానం సంపాందించుకుంది. హైదరాబాద్ లో మొత్తం 11,100 మంది మిలినీయర్లు ఉన్నట్లు తెలిపింది. 2012 నుంచి 2022 మధ్య కాలంలో నగరంలో సంపన్నుల సంఖ్య 78శాతం పెరిగిందని పేర్కొంది.
ఇక ఈ జాబితాలో 3,40,000 మిలినీయర్లతో అమెరికాలోని న్యూయార్క్ సిటీ తొలి స్థానంలో నిలవగా..2,90,300 మంది మిలినీయర్లతో జపాన్ రాజధాని టోక్యో రెండవ స్థానంలో నిలిచింది. 2,85,000 మందితో శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా, 2,58,000 మందితో లండన్ నాలుగో స్థానంలో నిలిచాయి.
ఇండియా నుంచి చూస్తే 59,400 మంది మిలినీయర్లతో ముంబయి 21వ స్థానంలో.. 30,200 మిలినీయర్లతో ఢిల్లీ 36వ స్థానంలో నిలిచాయి. 12,600 మంది మిలియనీర్లతో బెంగళూరు 60వ స్థానంలో.. 12,100 మందితో కోల్‌కతా 63వ స్థానంలో ప్లేస్ దక్కించుకున్నాయి.