హైదరాబాద్, 7 అక్టోబర్ 2023: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) నిర్వాహకులు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సీజన్ 3ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, సెక్రటరీ, డి. వందిత్ రెడ్డి , శ్రీనిధి యూనివర్శిటీ చైర్మన్, లీగ్ టైటిల్ స్పాన్సర్ డాక్టర్ కె.టి.మహి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “గోల్ఫింగ్ కమ్యూనిటీ కోసం మరో లీగ్‌ని నిర్వహించడంపై మేము సంతోషిస్తున్నాము. ఈ గోల్ఫ్ లీగ్‌ను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణా పర్యాటక శాఖ వారు అందించిన మద్దతుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతున్న TPGLతో జంట నగరాల్లో గోల్ఫ్‌పై అవగాహన పెరగటంతో పాటుగా భాగస్వామ్యం కూడా పెరిగింది, లీగ్2లో 16 జట్లు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. వారితో పాటుగా స్పాన్సర్‌ల విలువైన సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము” అని అన్నారు.
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి వందిత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్ 3 గణనీయమైన రీతిలో 16 జట్ల నుండి ఆసక్తిని పొందింది. శ్రీనిధి విశ్వవిద్యాలయం మూడోసారి టైటిల్ స్పాన్సర్‌గా తిరిగి వచ్చింది. టీపీజీఎల్‌ను ఈ రోజు అద్భుతమైన విజయంగా మార్చడంలో దోహదపడిన టీమ్ స్పాన్సర్‌లందరి భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఈవెంట్ క్రీడాకారులకు గోల్ఫ్ పోటీలో పాల్గొనడానికి, వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి విలువైన అవకాశాన్ని అందిస్తుంది…” అని అన్నారు.
లీగ్‌లో పోటీ పడబోయే 16 జట్లు:
1. శ్రీనిధియన్ థండర్‌బోల్ట్స్ (స్పాన్సర్లు : డా. కె.టి. మహీ & డా. జవహర్ మహి)
2. టీమ్ టీ ఆఫ్ (స్పాన్సర్లు 1: సామ్ ఎ చినోయ్ & జె. పి. రెడ్డి)
3. వ్యాలీ వారియర్స్ (స్పాన్సర్ ప్రదీప్ మిట్టల్ )
4. అపోలో క్యాన్సర్ క్రూసేడర్స్ (స్పాన్సర్: డా. పి విజయ్ ఆనంద్ రెడ్డి)
5. MYK స్ట్రైకర్స్ (స్పాన్సర్: మురళి యాదమ)
6. విల్లాజియో హైలాండర్స్ (స్పాన్సర్: శైలేందర్ సింగ్)
7. టీమ్ మైసా (స్పాన్సర్: దీపక్ గుల్లపల్లి)
8. KLR కింగ్స్ (స్పాన్సర్: K లక్ష్మా రెడ్డి)
9. ఆర్య వారియర్స్ (స్పాన్సర్: కల్వకుంట్ల నర్సింగ్ రావు)
10. అవెంజర్స్ (స్పాన్సర్: పెన్మత్స శ్రీ హరి రాజు)
11. ఆటమ్ ఛార్జర్స్ (స్పాన్సర్: నేహా అహ్లువాలియా)
12. డెక్కన్ నవాబ్స్ (స్పాన్సర్: రవీందర్ నాథ్, శరత్ చంద్ర కోడూరి, ప్రేమ్ కుమార్ పోలవరపు)
13. లహరి లయన్స్ (స్పాన్సర్: గడ్డిపాటి సంజయ్ చౌదరి)
14. స్టార్జ్ టీమ్ (స్పాన్సర్: శ్రీనివాసు సత్తి)
15. సెలబ్రిటీ స్టింగర్స్ (స్పాన్సర్: ఐశ్వర్య మాదిరెడ్డి)
16. ఊర్జిత ఈగిల్స్ (స్పాన్సర్: వీర్ ప్రకాష్)
TPGL-2023 ప్రారంభం- శుక్రవారం అక్టోబర్-06
మొదటి రౌండ్ -ఆదివారం అక్టోబర్-08
రెండవ రౌండ్- బుధవారం అక్టోబర్-11
మూడవ రౌండ్- శనివారం అక్టోబర్-14
నాలుగో రౌండ్ -బుధవారం అక్టోబర్-18
ఐదవ రౌండ్- శనివారం అక్టోబర్-21
అక్టోబర్-25- బుధవారం ఓపెన్ డే
క్వార్టర్ ఫైనల్స్- ఆదివారం – అక్టోబర్-29
సెమీఫైనల్స్ -బుధవారం -నవంబర్-01
ఫైనల్స్- శనివారం- నవంబర్-04
TPGL ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్- ఆదివారం -నవంబర్-05
మరిన్ని వివరాల కోసం https://tpgl.in/ ; కళ్యాణ్ చక్రవర్తి @ 9381340098